Begin typing your search above and press return to search.

రెండు మిలియన్ల బన్నీ ప్రేమ

By:  Tupaki Desk   |   9 Oct 2018 12:40 PM GMT
రెండు మిలియన్ల బన్నీ ప్రేమ
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో ఘనతను అందుకున్నాడు. సోషల్ మీడియా యాప్ ఇన్స్ టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోయర్స్ ను చేరుకున్న సందర్భంగా అభిమానులు సంబరంగా ఉన్నా నిన్నటి దాకా బన్నీ స్పందన మౌనమే. అశేషంగా వస్తున్న అభినందనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అల్లు అర్జున్ ఎట్టకేలకు తన మీద ఇంత ప్రేమ చూపించిన ఫ్యాన్స్ కు థాంక్స్ చెబుతూ మెసేజ్ పెట్టాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక కేరళలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న బన్నీ అభిమానులు దీన్నో అఛీవ్మెంట్ గా భావిస్తున్నారు.

ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక హీరోకు ఎంత బేస్ ఉందనేది గ్రౌండ్ లెవెల్ కు వెళ్లి ఎవరూ చూడలేరు. కౌంట్ చేయడం అనేది అసాధ్యం. థియేటర్ దగ్గర జనాన్ని బట్టో లేక ప్రీమియర్ షోలకు వచ్చిన లెక్కను బట్టో ఇది చెప్పలేం. కానీ ఆన్ లైన్ లో వీటికి కొలమానం ఉంటుంది. ఫేస్ బుక్- ట్విట్టర్ - ఇన్స్ టాగ్రామ్ ఇలా రకరకాల యాప్స్ లో ఎంత మంది ఫాలోయర్స్ ఉన్నారనే లెక్క ఖచ్చితంగా ఉంటుంది. అఫ్ కోర్స్ వీటి మీద కూడా అమితాబ్ లాంటి స్టార్లు అప్పుడప్పుడు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నా నెంబర్ ని మాత్రం తోసిపుచ్చలేని పరిస్థితి.

సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో రచ్చ చేస్తున్న అల్లు అర్జున్ తన కొత్త సినిమా విషయంలో మాత్రం ఏదీ తేల్చడం లేదు. త్రివిక్రమ్ తో ఉండొచ్చు అనే ఊహాగానాలకు తెరదించుతూ స్వయంగా దర్శకుడే కథ తన దగ్గర రెడీగా లేదని టైం పడుతుందని చెప్పడం చూస్తే ఇది కార్య రూపం దాల్చడం అనుమానమే. ఇంతకు ముందు విక్రమ్ కుమార్ తో ఉంటుంది అని గట్టిగా ప్రచారం జరిగింది కానీ దాని గురించి ఎలాంటి అప్ డేట్ బయటికి రావడం లేదు. అసలు అల్లు అర్జున్ తో నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనే సస్పెన్స్ ఇంతకీ తెగడం లేదు. నా పేరు సూర్య వచ్చి ఐదు నెలలు దాటేసింది. శాటిలైట్ ఛానల్ లో కూడా రాబోతోంది.అయినా బన్నీ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళకపోవడం అభిమానులను ఆందోళన కలిగించేదే. అన్ని సెట్ అయ్యాక టైం వచ్చినప్పుడు నేనే చెబుతాను అని బన్నీ అంటున్నా త్వరగా చెప్పమని ఫ్యాన్స్ కోరడంలో తప్పేమి లేదు. మరి వీటికి చెక్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి.