Begin typing your search above and press return to search.

త‌గ్గేదే లే.. విరాట్ పోస్ట‌ర్ పై పుష్ప‌రాజ్‌ స్పంద‌న

By:  Tupaki Desk   |   12 April 2021 9:30 AM GMT
త‌గ్గేదే లే.. విరాట్ పోస్ట‌ర్ పై పుష్ప‌రాజ్‌ స్పంద‌న
X
సినిమా- క్రికెట్ అవినాభావ సంబంధం గురించి తెలిసిన‌దే. సినిమా స్టార్లు క్రికెట‌ర్ల‌ను కూడా ప్ర‌భావితం చేస్తున్నారు. అందుకు చాలా ప్ర‌త్య‌క్ష సాక్ష్యాలున్నాయి. ఇది కూడా ఒక సాక్ష్యం. స్టైలిష్ స్టార్ అలియాస్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో నాలుగైదు భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఈ సినిమాకి ప్ర‌చారం కూడా అదే స్థాయిలో సాగుతోంది. త‌గ్గేదేలే అంటూ పుష్ప టీజ‌ర్ సృష్టించిన సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన పనే లేదు. పుష్పా టీజర్ యూట్యూబ్ లో విడుదలైన వెంటనే అసాధారణ వీక్షణలతో సంచ‌ల‌నాలు సృష్టించింది.

ఇక బ‌న్ని న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో(2020) పాట‌ల్ని ఫాలో చేస్తూ పేర‌డీ వీడియోలు సృష్టిస్తూ ఆస్ట్రేలియ‌న్ ఆట‌గాడు డేవిడ్ వార్నర్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అత‌డు బ‌న్నికి గొప్ప ఫాలోవ‌ర్. తెలుగులో కొన్ని ప‌వ‌ర్ ప్యాక్డ్ డైలాగ్ ‌లను వినిపించి క్రేజీ పాట‌‌లకు డ్యాన్స్ లు చేసిన వార్నర్ తెలుగు సినిమా స్థాయిని ఎలివేట్ చేశారు. అలాగే ఐపిఎల్ ఆటగాళ్ళు తెలుగు పాటలకు డ్యాన్సులు చేస్తూ త‌మ‌కు కూడా ప్ర‌తిభా పాఠ‌వం ఉంద‌ని నిరూపిస్తున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ను రెండు వికెట్ల తేడాతో చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో ఓడించింది. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్టర్ కోహ్లీ ఫోటోను పోస్ట్ చేసింది. ఆస‌క్తిక‌రంగా ఈ పోస్ట‌ర్ లో కోహ్లీ రూపంపై ప్రశంస‌లు కురిసాయి. అత‌డి టీమ్ చివ‌రి నిమిషంలో పుష్ప‌రాజ్ లా చెల‌రేగింద‌ని అభిమానులు ప్ర‌శంసించారు.

అల్లు అర్జున్ ముఖాన్ని కోహ్లీగా మార్ఫింగ్ చేసినా దానికి అసాధార‌ణ స్పంద‌న వ‌చ్చింది. ``తగ్గేదే లే... ప్రారంభం రాణించింది`` అన్న ట్వీట్ తో .. ఆర్‌సిబి బృందం ఆటుపోట్లను అధిగ‌మించి ఎలా గెలిచింది? అన్న‌ది హైలైట్ అయ్యింది. ఈ పోస్ట‌ర్ కు పుష్ప‌రాజ్ అలియాస్ అల్లు అర్జ‌న్ స్పందించారు. ఆయ‌న స్మైలీ ఈమోజీల్ని షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇరు పోస్టర్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్నాయో చెప్పేందుకు ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ప్ర‌స్థావిస్తే చాలు.