Begin typing your search above and press return to search.
బన్నీ హామీ ఇచ్చాడు.. వచ్చేయండి
By: Tupaki Desk | 12 Nov 2018 11:30 AM GMT‘మీ టూ’ మూమెంట్ కొన్ని నెలలుగా ఎంత ఉద్ధృతంగా సాగుతోందో తెలిసిందే. దీని కారణంగా ఇండియాలో వివిధ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఐతే మిగతా ఇండస్ట్రీల కంటే ముందు టాలీవుడ్లో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద రచ్చే నడిచింది. శ్రీరెడ్డి సహా కొందరు ఇక్కడ అవకాశాల కోసం మహిళల్ని ఎలా వేధిస్తారో చెప్పారు. తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడారు. కానీ శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టిన ఘటనతో ఇక్కడ ఉద్యమం పక్కదోవ పట్టింది. తర్వాత తర్వాత ఈ చర్చకు తెరపడింది. అదే సమయంలో మిగతా ఇండస్ట్రీలో ‘మీ టూ’ మూమెంట్ ప్రకంపనలకు దారి తీసింది. టాలీవుడ్లో మాత్రం అందరూ కాస్టింగ్ కౌచ్ విషయమై గప్ చుప్ అయిపోయారు.
ఇలాంటి సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘మీ టూ’ గురించి మాట్లాడ్డం విశేషం. ఈ మధ్య అందరూ ‘మీ టూ’ అని.. కాస్టింగ్ కౌచ్ అని అంటున్నారని.. కానీ తాను మాత్రం టాలీవుడ్లోకి అమ్మాయిలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాననని చెప్పాడు బన్నీ. ఇండియాలోనే క్లీనెస్ట్ ఇండస్ట్రీ టాలీవుడ్డే అని బన్నీ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. మన పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులన్నవే ఉండవన్నట్లుగా బన్నీ మాట్లాడాడు. తెలుగులో నటించే వేరే భాషల హీరోయిన్లందరూ కూడా తెలుగుకే తమ తొలి ప్రాధాన్యం అని చెబుతారని.. ఈ ఇండస్ట్రీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని.. టాలీవుడ్ ఎంత సురక్షితమో చెప్పడానికి ఇది నిదర్శమని బన్నీ అన్నాడు. ఐతే బన్నీ చెప్పినట్లుగా క్లీనెస్ట్ ఇండస్ట్రీ టాలవుడ్డే అంటే జనాలు నమ్ముతారా అన్నది డౌటే. అసలు కాస్టింగ్ కౌచ్ గురించి మొదట ఆరోపణలు వచ్చిందే టాలీవుడ్లో. కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఉద్యమం పక్కదోవ పట్టింది కానీ.. లేదంటే ఈపాటికి పెద్ద రచ్చే జరిగుండేదేమో.