Begin typing your search above and press return to search.

నెగెటివ్ టాక్ అలవాటే అంటున్న బన్నీ

By:  Tupaki Desk   |   10 May 2018 10:20 AM GMT
నెగెటివ్ టాక్ అలవాటే అంటున్న బన్నీ
X
అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాతోను వైవిధ్యం చూపించేందుకు చాలానే ప్రయత్నిస్తూ ఉంటాడు. అటు గెటప్ నుంచి ఇటు యాక్టింగ్ వరకు.. హెయిర్ స్టైల్ నుంచి డ్రెసింగ్ వరకూ విభిన్నంగా ప్రయత్నించేందుకు ట్రై చేస్తాడు.

ఇక ఫైట్స్ సంగతి సరే సరి. డ్యాన్సుల విషయానికి వస్తే.. బన్నీ విపరీతంగా శ్రమిస్తూ ఉంటాడనే సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే.. కష్టపడినంత మాత్రాన పాజిటివ్ రియాక్షన్ వచ్చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేయడం అత్యాశే. బన్నీ రీసెంట్ మూవీ నా పేరు సూర్య విషయంలో.. కంటెంట్ ను మెచ్చుకోవడంతో పాటు.. నెగిటివ్ టాక్- మిక్సెడ్ టాక్ వంటివి కూడా బాగానే స్ప్రెడ్ అయ్యాయి. వీటిపై బన్నీ ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. హరీష్ శంకర్-వక్కంతం వంశీలతో కలిసి ఇచ్చిన ఒక పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు బన్నీ.

మిక్సెడ్ టాక్ తో సూపర్ హిట్స్.. బ్లాక్ బస్టర్లు కొట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నించాడు హరీష్ శంకర్. దీనికి రియాక్ట్ అయిన బన్నీ.. అసలు తను నటించిన సినిమా సినిమాల్లో ఒక్క రేసుగుర్రం మినహాయిస్తే.. మరే చిత్రానికి విడుదల అయిన మొదటి రోజు మొదటి ఆటకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదని అన్నాడు. ప్రతీ సినిమాకు ఎఫర్ట్ పెట్టడం వరకే తన చేతుల్లో ఉంటుందన్న అల్లు అర్జున్.. అలా కష్టపడకుండా హిట్టు వచ్చినా పెద్దగా కిక్ రాదని అన్నాడు. నా పేరు సూర్యకు డివైడ్ టాక్ రావడం కలవరపెట్టే విషయమే కాదని తేల్చేశాడు స్టైలిష్ స్టార్.