Begin typing your search above and press return to search.

నాగ్ కే ఇంటికెళ్లి వాళ్ల అబ్బాయి గురించి సలహాలు ఇచ్చాడట

By:  Tupaki Desk   |   20 Oct 2021 3:55 AM GMT
నాగ్ కే ఇంటికెళ్లి వాళ్ల అబ్బాయి గురించి సలహాలు ఇచ్చాడట
X
సినిమా ఫంక్షన్లలో అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలు రివీల్ అవుతుంటాయి. నటీనటులు కానీ దర్శక నిర్మాతలు కానీ భావోద్వేగంతో చెప్పే మాటల్లో.. అప్పటివరకు బయట వారికి తెలియని విషయాల్ని వారు చెబుతుంటారు. తాజాగా అలాంటి విషయాన్నే వెల్లడించారు బన్ని అలియాస్ అల్లు అర్జున్.

అక్కినేని కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి అందంగా మాట్లాడిన బన్నీ.. అఖిల్ మీద తనకున్న అభిమానాన్ని అందరి ముందు ఓపెన్ అయ్యేందుకు ఏ మాత్రం మొహమాటపడలేదు. తనకు అఖిల్ ను చూస్తే.. తన తమ్ముడన్న భావన కలుగుతుందని.. అతడి లుక్.. స్టైల్ తనను ఆకట్టుకుంటుందని చెప్పాడు. అఖిల్ మీద తనకున్న అభిమానాన్ని చెప్పే క్రమంలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు అల్లు అర్జున్.

ఒకసారి తాను నాగార్జున ఇంటికి వెళ్లానని.. అప్పుడు అఖిల్ ను ఎలా లాంఛ్ చేయాలన్న దానిపై ఆయనకు తాను చాలా సలహాలు ఇచ్చానని.. ఇదంతా ఎందుకు చెప్పానంటే.. అఖిల్ మీద తనకున్న అభిమానం ఎంతన్నది చెప్పేందుకేనని పేర్కొన్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో మోస్ట్ క్యాలిక్యులేటెడ్ యాక్టర్లలో నాగార్జున ఒకరన్న సంగతి తెలిసిందే. సినిమా హీరోగా ఉండి.. బిజినెస్ విషయంలో ఆయన్నుమించిన వారు లేరనే చెబుతారు. తెర మీద తన నటనతో.. లుక్స్ తో ఆకట్టుకునే నాగ్.. బిజినెస్ టర్మ్స్ లో అతన్ని మించినోళ్లు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటారని చెబుతారు.

అంతటి క్యాలిక్యులేటెడ్ నాగ్ దగ్గరకు వెళ్లి.. ఆయన కొడుకును ఎలా లాంఛ్ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని చర్చించటం అంటే మాటలు కాదు. ఈ విషయంలో అల్లుఅర్జున్ ను అభినందించాల్సిందే. తాజా వ్యాఖ్యలతో బన్నీ తనలోని మరో షేడ్ ను చెప్పారని చెప్పాలి.