Begin typing your search above and press return to search.
మహేష్ కి బన్నీ సారీ ఎందుకు చెప్పాడంటే..
By: Tupaki Desk | 8 Oct 2015 7:30 AM GMTశ్రీమంతుడు లాంటి సక్సెస్ సాధించిన తర్వాత.. మహేష్ ట్విట్టర్ ద్వారా ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ సంచలనమే సృష్టించింది. సమాజానికి మంచి చేసే ఒక మూవీతో ఇంత సక్సెస్ సాధించినా రామ్ చరణ్ తప్ప.. ఎవరూ కాల్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించదన్నాడు మహేష్ బాబు. అయితే... సూపర్ స్టార్ చెప్పిన ఈ మాట చాలామందికే గుచ్చుకుంది కానీ... ఎవరూ బైట పడలేదు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాకాదు. ప్రస్తుతం రుద్రమదేవి ప్రమోషన్స్ లో ఉన్న బన్నీ.. అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
"ఇండస్ట్రీలో ప్రభాస్ - రాణా నాకు మంచి స్నేహితులు, కానీ మహేష్ తో అంతగా టచ్ లేదు. అయితే శ్రీమంతుడు విషయంలో మహేష్ చేసిన కామెంట్ తో నేను ఫీలయ్యాను. వెంటనే కాల్ చేసి.. ఆలస్యంగా విషెస్ చెబ్తున్నందుకు సారీ చెప్పాను. దానికి మహేష్ కూడా చాలా సున్నితంగా రియాక్ట్ అయ్యాడు " అంటున్నాడు అల్లు అర్జున్. నిజానికి ఇండస్ట్రీలో మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్. పూర్తి స్థాయిలో పరిశ్రమతో టచ్ లో ఉండడం తక్కువ. దీంతో సమకాలికుల్లోనూ ఎక్కువ స్నేహితులు లేరు సూపర్ స్టార్ కి. దీంతో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఇది.
వాస్తవానికి యంగ్ హీరోలంతా మంచి స్పీడ్ మీదే ఉన్నారు. ఒకరితో ఒకరు పార్టీలు, ఒకరు హిట్ కొడితే ఇంకొకరు పార్టీలు ఇవ్వడాలు లాంటివి బాగానే జరుగుతున్నాయి. కానీ శ్రీమంతుడు ఇన్సిడెంట్ తర్వాత... స్వచ్ఛందంగా స్పందించి ఒకరికొకరు అభినందనలు చెప్పుకుంటున్నారు. టాలీవుడ్ లో ఇదో చక్కని ఛేంజ్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయినా.. మహేష్ ఓ మార్పునకు తెర తీసినట్లే అనాలి.