Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ లో కన్ఫ్యూజన్‌ గురూ!!

By:  Tupaki Desk   |   30 March 2016 5:12 AM GMT



స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రానికి ప్రమోషన్స్ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ కూడా చేయకపోతుండడంతో... డిఫరెంట్ స్టైల్లో పబ్లిసిటీ ప్లాన్ చేశారు. ఇప్పటికే బ్లాక్ బస్టరే అనే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసిన సరైనోడు యూనిట్.. సోమవారం రోజున ఐటెం పాటను ఫుల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

సరైనోడు సినిమాలో ఐటెం భామగా కనిపించిన అంజలి కూడా ఇదే విషయాన్ని యూట్యూబ్ ద్వారా చెప్పింది. "సరైనోడు నుంచి పూర్తి బ్లాక్ బస్టర్ సాంగ్ ఇదుగో" అంటూ అంజలి ట్వీట్ చేసింది. మరోవైపు హీరో అల్లు అర్జున్ కు చెందిన పీఆర్ఓలు, సన్నిహితులు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. సాయంత్రానికల్లా అల్లు అర్జున్ కూడా ఓ ట్వీట్ వేశాడు. "సరైనోడు మూవీలో బ్లాక్ బస్టర్ ఫుల్ సాంగ్ ఇదే" అంటూ ఓ యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చాడు బన్నీ.

దీంతో అందరూ ఐటెం సాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేయబోతున్నారని భావించారు. కానీ విడుదల చేసిన పాటను చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. అక్కడ ఉన్నది కేవలం లిరిక్ మాత్రమే. విజువల్స్ అన్నీ ప్రోమోలోని సన్నివేశాలతో నింపేశారు. పబ్లిసిటీ చేయడంలో వాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారో... ఫాల్స్ పబ్లిసిటీకి ప్లాన్ చేశారో అర్ధం కాక ఫ్యాన్స్ మాత్రం తెగ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇది కేవలం లిరికల్‌ వీడియో గురూ!!