Begin typing your search above and press return to search.
ఉప్పు కోసం ఉయిని వెళ్తున్న సరైనోడు
By: Tupaki Desk | 8 March 2016 6:14 AM GMTకొత్త కొత్త ఏరియాల్లో షూటింగ్ చేసి, అక్కడి ప్రకృతి అందాలతో పాటు హీరో హీరోయిన్లను చూపిస్తూ పాటలు తీయడం.. ఎప్పటి నుంచో టాలీవుడ్ సినిమాల స్టైల్. ఇప్పటికీ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది కానీ.. ఏరియాలు మాత్రం దేశాలు - ఖండాలు దాటిపోతున్నాయి. ఇప్పుడు దక్షిణ అమెరికాలోని బొలీవియాలో షూటింగ్ చేసేందుకు సరైనోడు సిద్ధమైంది. ఇక్కడ సలార్ దే ఉయుని అనే ఏరియాలో షూటింగ్ చేయబోతున్నారు.
'ఉయుని వెళ్లేందుకు బయల్దేరి ఇప్పటికి 50 గంటలు గడిచింది. ఇంకా చేరుకోలేదు. కానీ ఎంతో అందమైన ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఇంత టైం వెచ్చించడంలో తప్పులేదు. త్వరలో ఉయుని పిక్చర్స్ పోస్ట్ చేస్తా' అంటూ సరైనోడులో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. ఈ సలార్ దే ఉయునికి చాలా స్పెషాలిటీ ఉంది. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు మళ్ల దీవి ఇదే.
అంతరిక్షంలో నుంచి కూడా తెల్లగా కనిపించే ప్రాంతం అంటే.. ఇక్కడ ఏ రేంజ్ లో ఉప్పు ఉంటుందో అర్ధమవుతుంది. ప్రతీ సీజన్ లోనూ కొత్తగా మారిపోయే ఇక్కడి వాతావరణం.. సూర్యోదయం - సూర్యాస్తమయాల్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం వైట్ క్రిస్టల్స్ ని నేల మీద పరిచినట్లుగా ఉండే ఉయునిలో.. షూటింగ్ జరుకుంటున్న తొలి తెలుగు సినిమా సరైనోడు. ఇక్కడ తీయబోయే పాటలతో.. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు.