Begin typing your search above and press return to search.
బన్నీ కోసం సర్కారు వారి పాట.. నిజం ఏంటి?
By: Tupaki Desk | 10 May 2022 2:30 AM GMTమహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కి ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. పెద్ద సినిమాలు విడుదల సమయంలో సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం చాలా కామన్ విషయం. అలాగే ఈ సినిమా గురించి కూడా కొన్ని పుకార్లు మీడియాలో జోరుగా షికారు చేసి జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దర్శకుడు పరశురామ్ ఈ సినిమా కథను మహేష్ బాబు కోసం కాకుండా అల్లు అర్జున్ కోసం రాసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. వరుసగా రెండు సినిమాలను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేసిన పరశురామ్ ఈ కథను కూడా గీతా ఆర్ట్స్ లోనే.. అది కూడా అల్లు అర్జున్ తో చేయాలని భావించాడని.. కాని బన్నీ మరియు అల్లు అరవింద్ లకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదని అందుకే సినిమా పట్టాలెక్కలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆ పుకార్లపై దర్శకుడు పరశురామ్ స్పందించాడు. గీత గోవిందం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న సమయంలో ఈ లైన్ ఐడియా వచ్చింది. కాన్సెప్ట్ రెడీ చేసుకుని మహేష్ బాబు గారిని కలిశాను. ఆయన కాన్సెప్ట్ కు ఎగ్జైట్ అయ్యారు. దాంతో స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాను. అంతే తప్ప ఈ సినిమా కథ ఏ ఒక్క హీరో గురించి రాసుకోలేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ ఆయన తెలియజేశాడు.
గీత గోవిందం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. అంతకు ముందు చిన్న సినిమాలు ఒక మోస్తరు విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి పరశురామ్ దర్శకత్వంలో సినిమా అనగానే మహేష్ బాబు అభిమానులు ఆశ్చర్యపోయారు. కాని మహేష్ బాబును అభిమానులు ఏ రేంజ్ లో చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో పరశురామ్ చూపించబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.
హీరోగా మహేష్ బాబును ఎంతగా అభిమానులు అభిమానిస్తారో తాను కూడా అంతగా మహేష్ బాబును అభిమానించి ఈ సినిమా ను చేశాను అంటూ పరశురామ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మహేష్ బాబుకు పోకిరి మరియు దూకుడు ఎలా అయితే నిలిచి పోయే సినిమాలు అయ్యాయో అదే విధంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను పరశురామ్ వ్యక్తం చేస్తున్నాడు. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే.