Begin typing your search above and press return to search.
సరైనోడు.. మామూలోడు కాదు
By: Tupaki Desk | 25 April 2016 11:30 AM GMT‘సరైనోడు’ సినిమాకు తొలి రోజు వచ్చిన టాక్ కు.. ఆ సినిమా సాధిస్తున్న కలెక్షన్లకు ఏమాత్రం పొంతన కనిపించట్లేదు. డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు కలెక్షన్లు పడిపోతాయని అనుకున్నారు చాలామంది. కానీ అలాంటిదేమీ కనిపించలేదు. వీకెండ్ అయ్యాకైనా జోరు తగ్గుతుందేమో అనుకుంటే.. సోమవారం కూడా మంచి కలెక్షన్లలో పెద్దగా డ్రాప్ ఏమీ కనిపించట్లేదు. సోమవారం మార్నింగ్ షోలకు హైదరాబాద్ అంతా కలిపి 30 షోలు హౌస్ ఫుల్ అయినట్లు ట్రేడ్ అనలిస్టుల నుంచి సమాచారం అందుతోంది. ‘బుక్ మై షో’లో చూస్తే దాదాపుగా అన్ని షోలకూ 80 శాతానికి పైగా టికెట్లు బుక్ అయి కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
మల్టీప్లెక్సుల్లోనే మంచి కలెక్షన్లు వస్తుంటే.. ఇక బి-సి సెంటర్లలో సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ సెంటర్లలో సినిమా ఇరగాడేస్తోంది. ఈ రోజు ఉదయం చాలా టౌన్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఏలూరు టౌన్లో ఆడుతున్న మూడు థియేటర్లలోనూ ఉదయం షోకు హౌస్ ఫుల్స్ పడటం విశేషం. సరిగ్గా పిల్లలకు పరీక్షలు పూర్తయి సెలవులిచ్చే టైంలో రావడం ‘సరైనోడు’కు బాగా కలిసొస్తోంది. బోయపాటి శ్రీను తరహా మాస్ మసాలా అంశాల్ని ఇష్టపడే వారికి ‘సరైనోడు’ విందు భోజనమే. ఇక మిగతా ప్రేక్షకుల్ని కూడా ఓ మోస్తరుగా మెప్పించే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండటం కలిసొస్తోంది. కథ పరంగా విశేషం ఏమీ లేకపోయినా.. టైంపాస్ అయిపోయే సినిమా కావడంతో ‘సరైనోడు’ బండి సాఫీగా సాగిపోతోంది. ఈ శుక్రవారం ‘రాజా చెయ్యి వేస్తే’ తప్పిస్తే పెద్ద సినిమాలేవీ పోటీలో లేకపోవడంతో రెండో వారం కూడా ‘సరైనోడు’ బాక్సాఫీస్ ను రూల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.