Begin typing your search above and press return to search.
వావ్!! డివైడ్ టాక్ టు బ్లాక్ బస్టర్
By: Tupaki Desk | 29 April 2016 12:35 PM GMTపాజిటివ్ టాక్ వచ్చిన సినిమాతో.. ఎవరైనా హిట్ కొడతారు.. కానీ డివైడ్ టాక్ - నెగిటివ్ టాక్ వచ్చిన మూవీతో సూపర్ హిట్స్ సాధించడం సాధ్యమా? కాదని ఆన్సర్ ఈజీగానే వస్తుంది కానీ.. అల్లు అర్జున్ ఈ ఈక్వేషన్ ని మార్చేస్తున్నాడు. తన సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా సూపర్ హిట్స్ - బ్లాక్ బస్టర్స్ సాధించేస్తున్నాడు. ఇప్పుడు బన్నీ లేటెస్ట్ మూవీ సరైనోడుకి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజునే డివైడ్ టాక్ వచ్చిన సరైనోడు.. కలెక్షన్స్ మాత్రం కుమ్మేశాడు.
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి వారం రోజుల్లో 45.72 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 34 కోట్ల వసూళ్లు దక్కాయి. ఇంకా స్టడీగా కలెక్షన్స్ ఉండడంతో.. ఈ చిత్రం ఈజీగా 65 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అసలు ఇలా డివైడ్ టాక్ వచ్చిన మూవీతో సక్సెస్ సాధించడం బన్నీకి అలవాటుగా మారిపోయింది. త్రివిక్రమ్ తో తీసిన జులాయి నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది.
మొదటి రోజున ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ జులాయి ఎవరికీ ఎక్కలేదు. చాలామంది జులాయి చిత్రం తేలిపోయిందని అన్నారు. కానీ రిజల్ట్ మాత్రం 40 కోట్ల మార్క్ ను దాటిపోయింది. గతేడాది వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి పొజిషన్ కూడా ఇదే. బాగా స్లో నెరేషన్ అనీ, బన్నీ మార్క్ కనిపించలేదని, కామెడీ అంతగా లేదని.. ఇలా మొదటి రోజున చాలానే మాటలు వినిపించాయి. చివరకి ఆ చిత్రం 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసి, ఇండస్ట్రీ జనాలకి మైండ్ బ్లాంక్ చేసింది.
ఇఫ్పుడు సరైనోడు పరిస్థితి కూడా ఇంతే. మొదటివారంలోనే 45కోట్లు కొల్లగొట్టగా.. ఫుల్ రన్ లో మరో 20 ఈజీగానే వసూలు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తం మీద బన్నీ నటించిన మూవీ డివైడ్ టాక్ వస్తేనే మూవీని సూపర్ హిట్ రేంజ్ చేరుకుంటుంటే.. ఇక బ్లాక్ బస్టర్ అనే మాట వినిపిస్తే.. రికార్డులు బద్దలు కొట్టేస్తాడేమో!!