Begin typing your search above and press return to search.
అల్లు అర్జున్ మళ్లీ కొట్టేశాడబ్బా..
By: Tupaki Desk | 1 May 2016 7:45 AM GMTపవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. లాంటి సూపర్ స్టార్లకు కూడా సాధ్యం కాని ఘనతల్ని సొంతం చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే నైజాం ఏరియాలో వరుసగా ఆరు సినిమాలతో రూ.10 కోట్ల షేర్ సాధించిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు బన్నీ. ఇప్పుడిక ఇంకో రికార్డు అతడి సొంతమైంది. వరుసగా నాలుగో సినిమాతో అతను రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకున్నాడు. తెలుగులో ఇంకే హీరో కూడా కనీసం మూడుసార్లు కూడా ఈ మార్కును టచ్ చేయలేదు. ‘రేసుగుర్రం’ సినిమాతో తొలిసారి రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేశాడు బన్నీ. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.60 కోట్ల దాకా వసూలు చేసింది. ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ డివైడ్ టాక్ తట్టుకుని మరీ రూ.55 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది.
ఇక గత ఏడాది అల్లు అర్జున్ ప్రత్యేక పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ సైతం 50 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇప్పుడు ‘సరైనోడు’ కూడా ఈ క్లబ్బులో చేరింది. మిగతా మూడు సినిమాల కంటే చాలా వేగంగా ‘సరైనోడు’ ఈ ఘనతను అందుకుంది. పదో రోజుకే ‘సరైనోడు’ వరల్డ్ వైడ్ షేర్ రూ.50 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. రెండో వీకెండ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బన్నీ సినిమానే బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. ఈ మూవీ ఫుల్ రన్లో రూ.60 కోట్ల దాకా షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. డివైడ్ టాక్ తో మొదలైన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే. బన్నీ ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి ఇది సరైన రుజువు.