Begin typing your search above and press return to search.

అల్లు హీరోకి పాన్ ఇండియా టెన్ష‌న్

By:  Tupaki Desk   |   13 Feb 2020 7:45 AM GMT
అల్లు హీరోకి పాన్ ఇండియా టెన్ష‌న్
X
టాలీవుడ్ లో ఇటీవ‌ల అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. గ‌డిచిన నాలుగేళ్ల‌లో హీరోల ఆలోచ‌న‌ల్లో అనూహ్య మార్పులు క‌నిపిస్తున్నాయి. తెలుగుతో పాటు ఇరుగు పొరుగు మార్కెట్ల‌లోనూ రాణించి పాన్ ఇండియా స్టార్లుగా నిరూపించుకోవాల‌న్న పంతం క‌నిపిస్తోంది. డార్లింగ్ ప్ర‌భాస్ ఇప్ప‌టికే పాన్ ఇండియా హీరోగా అన్ని భాష‌ల్లోనూ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. బాహుబ‌లి 1-2.. సాహో చిత్రాల‌తో ప్ర‌భాస్ మార్కెట్ హిందీ స‌హా అన్ని భాష‌ల్లోనూ విస్త‌రించింది. ప్ర‌భాస్ లానే రానా వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకొస్తున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తూ రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ సైతం త‌మ మార్కెట్ ని పాన్ ఇండియా లెవ‌ల్ కి తీసుకెళుతున్నారు. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ సైతం కెరీర్ 27వ సినిమాతో త‌న‌ని తాను పాన్ ఇండియా స్థాయిలో ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంతో చిరంజీవి పాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేశారు. త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ సైతం హిందీలో పెద్ద స్టార్ గా ఎదిగాడు. వీళ్ల‌తో పాటు... యంగ్ ట్యాలెంటెడ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా తొలి అడుగులు వేస్తున్నాడు. క‌ర‌ణ్ జోహార్ అత‌డికి హిందీ మార్కెట్లో బిగ్ బూస్ట్ ఇస్తుండ‌డం ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌మంది హీరోలు స‌ర్రున దూసుకెళుతుంటే... అల్లు కాంపౌండ్ ఊరుకుంటుందా? అల్లు అర్జున్ రేసులో వెన‌క‌బ‌డితే ఎలా? స‌రిగ్గా ఇదే ఆలోచించిన అల్లు హీరో ఇక‌పై లాభం లేద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఏ.ఆర్.మురుగ‌దాస్ ని బ‌రిలో దించి గ‌జిని సీక్వెల్ ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. తెలుగు- మ‌ల‌యాళంలో ఇప్ప‌టికే బన్ని పెద్ద స్టార్. అయితే హిందీ- త‌మిళ మార్కెట్లో త‌న‌ని తాను నిరూపించుకుంటే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేసిన‌ట్టే. ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టికే త‌న సినిమాల్ని హిందీలోకి అనువ‌దించి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ అక్క‌డ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు. ఇక‌పై పాన్ ఇండియా సినిమాల్లో న‌టించి ఇత‌ర స్టార్ల‌కు ధీటుగా ఎద‌గాల‌న్న పంతం క‌న‌బ‌రుస్తున్నాడు.

స‌త్తా చూపిస్తే భాష‌తో సంబంధం లేకుండా ఆడియెన్ ఆద‌రిస్తున్నారు. అందుకే బ‌న్ని ఈసారి సీరియ‌స్ గానే నిర్ణ‌యించుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములో ఇండ‌స్ట్రీ హిట్ సాధించిన క్ర‌మంలో త‌న‌ని తాను బాలీవుడ్ మీడియాలో ఫోక‌స్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు. ఆ క్ర‌మంలోనే ప్రముఖ జ‌ర్న‌లిస్ట్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్ర‌తిసారీ ఇంట‌ర్వ్యూల్లో హిందీ మార్కెట్లో స‌త్తా చాటాల‌న్న త‌న ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తున్నాడు. అలాగే హిందీలో న‌టించాల‌న్న ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తున్నాడు. త‌న సినిమాల హిందీ డబ్బింగులు సూపర్ హిట్ అవుతున్నాయి. స్ట్రెయిట్ గా హిందీ సినిమాల్లో న‌టించి స‌త్తా చాటాల‌ని బ‌న్ని భావిస్తున్నాడు. బ‌న్ని న‌టిస్తున్న ఏఏ 20 త‌ర్వాత మురుగ‌దాస్ తో ఏఏ 21 పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేయ‌నున్నార‌న్న ప్ర‌చారం ఇటీవ‌ల వేడెక్కిస్తోంది.