Begin typing your search above and press return to search.
'ఇన్షా అల్లా' అనేసిన అల్లు అర్జున్
By: Tupaki Desk | 20 Jun 2017 4:06 AM GMTఅల్లు అర్జున్ కిందటి ఏడాది నుండి తను అనని మాటలకు విమర్శల పాలవుతున్నాడు. నేను చెప్పను బ్రదర్ అన్న ఒక మాట వలన తను మాట్లాడే ప్రతి మాటను అన్నదానికి మించి ఊహిస్తున్నారు జనాలు. మొన్న జరిగిన సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో అర్జున్ కి బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ దక్కింది. ప్రకాష్ రాజ్ తను కు అవార్డ్ ని అందించారు. ఆ సందర్భంలో మనోడు “ఇన్షా అల్లా” అని ఒక మాట అనడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ - అల్లు శిరీష్ హోస్ట్ లుగా ఉన్నారు ఈ అవార్డ్ షో కి. అల్లు అర్జున్ అవార్డ్ తీసుకున్న తరువాత విజయ్ దేవరకొండ ఎన్ని తీసుకుంటావ్ అర్జున్? గీత ఆర్ట్స్ ఆఫీసులో కిరాణా షాప్ టైపులో అవార్డ్స్ పడున్నాయి అన్నాడు. మాకు కూడా కొంత ఛాన్స్ వదులు అనే ఉద్దేశ్యంతో. దానికి అర్జున్ “ఈ సారి బెస్ట్ క్రిటిక్స్ అవార్డ్ దక్కింది వచ్చే సారి ఉత్తమ నటుడు వస్తుంది అని ఆ తరువాత డెబ్యూట్ అవార్డ్ కూడా దక్కాలని ‘కోరుకుంటున్నాను’ అని అన్నాడు. అప్పుడు శిరీష్ మాట్లాడుతూ.. ''వచ్చే సంవత్సరం వీడు (విజయ్) నాకు ఆ అవార్డు రావాలని అనుకుంటున్నాడు'' అనగానే.. దానికి అల్లు అర్జున్... 'హోప్ ఫుల్లీ.. ఇన్షా అల్లా' అన్నాడు.
ఇక్కడ అందరి ప్రశ్న ఏంటంటే తథాస్తు అని తన మతంలో తెలుగులో అనకుండా ‘ఇన్షా అల్లా’ అనే పదజాలం ఎందుకు వాడినట్లు అని అందరూ ఆశ్చర్య పోయారు. చాలామంది బాలీవుడ్ ఖాన్స్ ఇదే విధంగా అంటుంటారు. 'ఇన్షా అల్లా' మతానికి సంబంధించిన మాట లాగా మనకు పరిచయం కాబట్టి ఇన్ని అనుమానాలుకు దారితీసింది. అరబిక్ బాషలో ఇన్షా అల్లా అంటే ‘దేవుడు నీకు తోడు ఉంటాడు’ అని లేక ‘నువ్వు అనుకున్నదానికి సరిపడే శక్తి దక్కలి’ అని లేక ‘అది జరగడానికి దేవుడు సహకరిస్తాడు’ అని అర్ధంగా చెప్పవచ్చు. అయితే బన్నీ ఈ పదం ఎందుకు వాడాడు అనే విషయంపై క్లారిటీ లేదులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/