Begin typing your search above and press return to search.

అబ్బా.. అల్లువారు మళ్ళీ వేసేశారుగా

By:  Tupaki Desk   |   24 Jan 2019 6:58 AM GMT
అబ్బా.. అల్లువారు మళ్ళీ వేసేశారుగా
X
అదేంటో గానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య చాలాసార్లు తన మాటలతో చేతలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఒకటేంటి.. అప్పుడెప్పుడో 'చెప్పను బ్రదర్' దగ్గరనుండి మొదలైన హంగామా నిన్న మొన్నటి 'గారు' వరకూ ఎన్నోసార్లు విమర్శలకు దారితీసింది. తాజా మరోసారి బన్నీ తన మాటలతో అందరి దృష్టిలో పడ్డాడు.

బన్నీ రీసెంట్ గా వింక్ గర్ల్.. సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా వారియర్ నటించిన 'ఒరు ఆదార్ లవ్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'లవర్స్ డే' సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. మలయాళంలో అల్లు అర్జున్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే కాబట్టి 'ఒరు ఆదార్ లవ్' టీమ్ కు ఇంతకంటే స్పెషల్ గెస్ట్ ఎవరుంటారు? మలయాళం లో తెరకెక్కిన ఈ స్మాల్ బడ్జెట్ సినిమాకు బన్నీ తన వైపు నుండి మద్దతు ఇవ్వడం మెచ్చుకోవాల్సిన విషయమే. ఈవెంట్ అంతా బాగానే ఉంది కానీ బన్నీ మాటల్లో "వై బాహుబలి కిల్డ్ కట్టప్ప?" అన్నాడు. అంతే.. ఇంక మాటల్లేవ్..! బన్నీ కూడా పొరపాటు జరిగిన విషయాన్ని గ్రహించలేదు.

వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది అందరికీ తెలుసుగానీ .. బాహుబలి కట్టప్పను చంపడం అనే ఐడియా నిజంగా కొత్తే. బన్నీకి అలవాటులో పొరపాటయినా.. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటో.. ఎప్పుడూ ఎదో ఒక విషయంలో బన్నీ నెటిజనులకు దొరుకుతూనే ఉన్నాడు. ఇకపైన బన్నీ తన స్పీచ్ ల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మాత్రం అవసరం. ఇదిలా ఉంటే 'లవర్స్ డే' సినిమాను వాలెంటైన్స్ డే రోజున విడుదల చేస్తున్నారు.