Begin typing your search above and press return to search.
అమ్మతో బన్నీ మొదటి సెల్ఫీ
By: Tupaki Desk | 8 May 2016 9:17 AM GMTమదర్స్ డే సందర్భంగా చాలామంది తారలు తమ అమ్మతో ఫోటో దిగి ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా సరైనోడుతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ కూడా.. ఇదే ఫాలో అయిపోయాడు. అమ్మతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు అల్లు వారబ్బాయి.
అల్లు అర్జున్ అమ్మ పేరు నిర్మల. ఓ బడా నిర్మాతకు భార్య, ఓ పెద్ద హీరోకు తల్లి అయిన ఈమె.. సాధారణంగా మీడియాకు దూరంగానే ఉంటారు. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్లకు మినహాయిస్తే.. బయట కనపించరీమె. అందుకే తన తల్లితో పాటు తను ఫోటో దిగి పోస్ట్ చేశాడు బన్నీ. ' మా అమ్మతో ఇది నా మొదటి సెల్ఫీ. మా అమ్మకు, ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మలకు హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు అల్లు అర్జున్.
అమ్మతో కలిసి సెల్ఫీ దిగుతున్న సంతోషం.. బన్నీ కళ్లలోనే బోలెడంత కనిపిస్తోంది. మరోవైపు కొడుకుతో కలిసి ఫోటో దిగుతున్న అమ్మ కూడా మనస్ఫూర్తిగా నవ్వేస్తున్నారు. ఇక సరైనోడు సక్సెస్ జోష్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని లింగుస్వామితోనే స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసి, జూన్ 1న షూటింగ్ స్టార్ట్ చేయాలన్నది బన్నీ ప్లాన్ గా చెబుతున్నారు.