Begin typing your search above and press return to search.

దాసరి కామెంట్స్‌పై బన్నీ సూటిగా...

By:  Tupaki Desk   |   10 April 2015 9:45 AM GMT
దాసరి కామెంట్స్‌పై బన్నీ సూటిగా...
X
చిరంజీవిని ఎప్పుడూ డైరెక్టుగా ఏమీ అనడు దాసరి నారాయణరావు. ఇన్‌డైరెక్టుగా పేరు పెట్టకుండానే వెయ్యాలనుకున్న సెటైర్‌ వేసేస్తుంటాడు. ఐతే మొన్నామధ్య సన్నాఫ్‌ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో వేసిన సెటైర్‌ అన్నింట్లోకి ఆణిముత్యం. ఈసారి చిరు పేరు పలక్కపోవడమే పెద్ద సెటైర్‌ అయింది. స్టయిల్‌ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత పవన్‌ కళ్యాణే అని దాసరి అనడం పెద్ద దుమారమే రేపింది. ఐతే అదే ఫంక్షన్లో, ఆ తర్వాత రుద్రమదేవి ఆడియో రిలీజ్‌ సందర్భంగా చిరు గురించి, ఆయన స్టయిల్‌ గురించి గొప్పగా మాట్లాడి.. దాసరికి ఇన్‌డైరెక్టుగా సెటైర్‌ వేసేశాడు బన్నీ.

ఐతే దాసరి వ్యాఖ్యలపై బన్నీని డైరెక్టుగా అడిగితే.. ''అది దాసరిగారి వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటో రుద్రమదేవి ఆడియో వేడుకలోనే చెప్పా. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లాంటి లెజెండ్స్‌ గురించి మాట్లాడినపుడు చిరంజీవి గారి గురించి కూడా ప్రస్తావించాల్సింది. ఐతే ఇదేం కావాలని చేసింది మాత్రం కాదని అనుకుంటున్నా'' అని చెప్పాడు బన్నీ. ఐతే బన్నీ అన్నట్లు దాసరి అనుకోకుండానే చిరు పేరు మర్చిపోయారని మాత్రం ఎవరూ అనుకోరు. దాసరి మాట్లాడారంటే ప్రతి మాటలోనే అంతరార్థమేదో ఉంటుంది. ప్రతి మాటా బాగా ఆలోచించి వదులుతుంటారాయన. అలాంటాయన యథాలాపంగా చిరు ప్రస్తావన మరిచిపోయారని ఎవరైనా ఎందుకనుకుంటారు?