Begin typing your search above and press return to search.

సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టిన అల్లు అర్జున్..!

By:  Tupaki Desk   |   1 Dec 2022 11:42 AM GMT
సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టిన అల్లు అర్జున్..!
X
పుష్ప పార్ట్ 1 ది రైజ్ సృష్టించిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ టాలెంట్ వందకి వంద శాతం వర్క్ అవుట్ అయిన సినిమా పుష్ప. తను ఏదైతే ఆడియన్స్ కు రీచ్ అవుతుందని అనుకున్నాడో అది అంతకు మించి రీచ్ అవడంతో సినిమా ఆ రేంజ్ సక్సెస్ అందుకుంది. అంతేకాదు పాన్ ఇండియా రిలీజ్ అని సరదాగా వదిలినా రీ సౌండ్ మాత్రం అదిరిపోయింది. పుష్ప రాజ్ యాటిట్యూడ్ నార్త్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. అందుకే తెలుగు రెండు రాష్ట్రాలకు ఈక్వల్ గా బాలీవుడ్ లో పుష్ప వసూళ్లు రాబట్టింది.

పుష్ప 1 అంచనాలను మించి సక్సెస్ అందుకోగా పుష్ప 2 మీద అందరి గురి ఉంది. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా షూటింగ్ కానిస్తున్నారు. అసలు కథ పార్ట్ 2 లోనే ఉందంటూ సుకుమార్ ఇచ్చిన హింట్ ప్రకారం పుష్ప 1 కాదు పుష్ప 2 నే అసలు రచ్చ షురూ చేస్తుందని అంచనా వేస్తున్నారు. పుష్ప 2 మొదలైందనే మాటే కానీ అనుకున్నంత వేగంగా జరగట్లేదు. ఈ మధ్యలో పుష్ప రష్యాలో రిలీజ్ సందర్భంగా మూవీ టీం అక్కడకు షిఫ్ట్ అయ్యింది.

అక్కడ కూడా పుష్ప భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు. పుష్ప 2 ని అనుకున్న విధంగా అనుకున్న టైం కి పూర్తి చేయాలని చూస్తున్నారు అల్లు అర్జున్. 2023 ఆగస్టు కల్లా ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 పూర్తి చేయమని సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టాడట అల్లు అర్జున్. పుష్ప 2 పూర్తి కాగానే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమాలు వచ్చి హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ చేస్తున్నారు.

పుష్ప 2 రిజల్ట్ ని బట్టి త్రివిక్రమ్ సినిమా ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇక మీదట తను తీసే సినిమాలన్నీ కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 ఆ తర్వాత సినిమాలు కూడా ఇదే వరుసలో అదరగొట్టేలా రెడీ చేస్తున్నారు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ స్ట్రాటజీ చూస్తుంటే పాన్ ఇండియా క్రేజ్ తో హంగామా కొనసాగించేలా ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.