Begin typing your search above and press return to search.
మార్నింగ్ వాక్ కి వెళ్లిన 'పుష్ప'...!
By: Tupaki Desk | 11 July 2020 12:30 PM GMTగత నాలుగు నెలలుగా షూటింగులు లేకపోవడంతో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే హీరోలు దొరికిన సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయిస్తూ వారితో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తన పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడంతో వారితో కలిసి ఆడుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు ఈ విషయాలను సోషల్ మీడియాలో ఈ విషయాలను షేర్ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా డ్యాన్సులతో పాటు కొన్ని వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఫిట్నెస్ కూడా మైంటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి అల్లు అర్జున్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ కనిపించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరోసారి మార్నింగ్ వాక్ కోసం బయటకి వచ్చారు బన్నీ.
బన్నీ మార్నింగ్ వాక్ కి వెళ్లిన విషయాన్ని తనే ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో పోస్ట్ చేసి ''లవ్ మార్నింగ్ వాక్స్'' అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫోటోలో కార్ హెడ్ లైట్స్ వెలుగుతుండటం చూస్తుంటే అల్లు అర్జున్ చాలా ఎర్లీగా వాకింగ్ వెళ్లినట్లు అర్థం అవుతోంది. అందులోనూ దీని కోసం సిటీ అవుట్ స్కర్ట్స్ కి వెళ్లినట్లు ఫోటో చూస్తే తెలుస్తోంది. 'పుష్ప' కోసం అల్లు అర్జున్ మైంటైన్ చేస్తున్న గెటప్ లోనే దర్శనమిచ్చాడు. అయితే మార్నింగ్ వాక్ ఫోటోని మాత్రం బన్నీ మధ్యాహ్న సమయంలో పోస్ట్ చేసారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ 'అన్నా.. ఇప్పుడు మధ్యాహ్నం అయింది' అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మొరటు కుర్రాడిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన 'పుష్ప' ఫస్ట్ లుక్ కి విశేష ఆదరణ లభించింది.