Begin typing your search above and press return to search.
కొడుకు బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బన్నీ
By: Tupaki Desk | 3 April 2020 9:10 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగులతో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికి తెలిసిందే. వాళ్ళతో కుదిరినప్పుడల్లా టైమ్ స్పెండ్ చేస్తూ, వాళ్ళని ఔటింగులకు తీసుకెళ్తూ ఫ్యామిలీ మ్యాన్ కూడా అనిపించుకున్నాడు. ముఖ్యంగా తన పిల్లల విషయంలో బన్నీ చాలా కేర్ ఫుల్ గా ఉంటాడు. వాళ్ళకి అన్నీ స్పెషల్ గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వారి విషయంలో ఎంత ఎమోషనల్ గా ఉంటాడో ఇంతక ముందు అనేక సందర్భాల్లో మనం చూసాం. ఏప్రిల్ 3వ తేదీ తన లైఫ్ లో చాలా ముఖ్యమైంది. కారణం ఆ రోజు తన ముద్దుల కొడుకు జన్మించిన రోజు. నేటితో ఆరేళ్ళు పూర్తీ చేసుకున్న అల్లు అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
'వాట్ ఈజ్ లవ్ అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, నా జీవితంలో ఇంతకముందు ఎన్నో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ని పొందాను. కానీ వాటిని నేను లవ్ అని భావించలేదు. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత అర్ధం అయింది 'లవ్' అంటే ఇది అని, 'లవ్' అంటే నువ్వని, ఐ లవ్ యు అయాన్, హాపీ బర్త్ డే మై బేబీ' అంటూ అల్లు అయాన్ పుట్టిన రోజును ఉద్దేశించి పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ చూస్తేనే అర్థం అవుతుంది బన్నీ ఎంత భావోద్వేగానికి గురయ్యాడో అని. అంతేకాకుండా ఈ సందర్భంగా అల్లు అయాన్ 6వ పుట్టినరోజు కేక్ కటింగ్ చేసే ఫోటోలను కూడా షేర్ చేసాడు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పుట్టిన రోజు వేడుకను జూబ్లీ హిల్స్ లోని తన ఇంట్లో సెలెబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ చూసిన వారు కూడా బన్నీ పోస్ట్ కి ఎమోషనల్ రిప్లై ఇస్తున్నారు.