Begin typing your search above and press return to search.

బ‌న్ని సైలెంట్ గా పంచ్ వేశాడా?

By:  Tupaki Desk   |   1 Feb 2020 6:46 AM GMT
బ‌న్ని సైలెంట్ గా పంచ్ వేశాడా?
X
ఇండ‌స్ట్రీ హిట్టు అంటూ అల టీమ్ చేసిన సంద‌డి గురించి తెలిసిందే. వ‌రుస‌గా సక్సెస్ మీట్లు.. పార్టీలతో అద‌రగొట్టేశారు. నాన్ బాహుబ‌లి రికార్డులు కొన్ని చోట్ల బ్రేక్ చేశామ‌ని సాక్షాత్తు బ‌న్ని తండ్రి గారు.. నిర్మాత అల్లు అర‌వింద్ వెల్ల‌డించారు. ఇండ‌స్ట్రీ హిట్టు అనే పోస్ట‌ర్ పైనా ఆ త‌ర్వాత‌ బ‌న్నీ ఎంతో తెలివిగా స‌మాధానం ఇచ్చారు. త‌మ సినిమా గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ప్రేక్ష‌కుల‌కు తెలియాల‌నే పోస్ట‌ర్ల‌పై వ‌సూళ్లు వివ‌రాలు వేస్తామ‌ని.. ఇలా వేడ‌యం అభిమానులపై ప్రేమ‌కు చిహ్నం అంటూ వ‌ర్ణించాడు.

అయినా రికార్డులు శాశ్వ‌తం కాదు. ఈరోజు నేను..రేపు ఇంకొక‌ హీరో...ఆ మ‌రుస‌టి రోజు మ‌రోక హీరోకి బ్రేక్ వ‌స్తుంద‌ని అన్నాడు. తాజాగా అల వైకుంఠ‌పుర‌ములో రికార్డుల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు. త‌న సినిమా రికార్డులు సాధించ‌డంపై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూనే ఈ రికార్డుల‌ను మ‌రో హీరో బ‌ద్ద‌లు కొట్టాల‌ని కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ రికార్డుల‌నేవి ఫాసింగ్ ఫేజ్ లాంటివి. ఈ రికార్డును ఇంకొక‌రు బ‌ద్ద‌లు కొడితేనే కిక్కు! అంటూ త‌న‌దైన శైలిలో బ‌న్ని చెప్పాడు. అలా జ‌రిగితేనే ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. మ‌రిన్ని స‌క్సెస్ లు అందుకుంటామంటూ వ్యాఖ్యానించాడు.

అయితే ఈ వ్యాఖ్య‌లు కాస్త నెగిటివ్ గాను ప‌రిశ్ర‌మ‌లో స్ప్రెడ్ అవుతున్నాయి. సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ అయిన స‌రిలేరు నీకెవ్వ‌రు- అల వైకుంఠ‌పుర‌ములో వ‌సూళ్ల వార్ .. ఆధిప‌త్య పోరు గురించి తెలిసిందే. రెండు యూనిట్లు ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డి వ‌సూళ్ల పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత ఉన్న‌ట్టుండి స‌రిలేరు టీమ్ సైలెంట్ అయిపోయింది. ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ స‌రిపెట్టుకుంది. దీంతో అల టీమ్ మ‌రింత స్పీడ్ పెంచింది. తాజాగా బ‌న్నీ చేసిన వ్యాఖ్య‌ల వెనుక వేరొక‌ హీరో ఉన్నాడ‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపైనా ఫిలిం వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి సంక్రాంతి పుంజుల మ‌ధ్య వార్ ఎండ్ లెస్ గానే సాగింద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. వ‌చ్చే సంక్రాంతి కి ప‌వ‌న్ - మ‌హేష్‌ - ఎన్టీఆర్ మ‌ధ్య వార్ సాగ‌నుంద‌ని తెలుస్తోంది.