Begin typing your search above and press return to search.
చరణ్ పై బన్నీ వీడియో వైరల్
By: Tupaki Desk | 28 March 2018 7:24 AM GMTకొన్ని రోజుల కిందటే అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ‘రంగస్థలం’లో రామ్ చరణ్ స్టయిల్లో డ్రెస్ చేసుకుని ఫొటోలకు పోజులివ్వడం.. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. అయాన్ ఇంట్లో ఎంతసేపూ ‘రంగస్థలం’ పాటలతో హోరెత్తించేస్తుంటే బన్నీ భరించలేక అతడిని చరణ్ ఇంటికి పంపడం.. చరణ్ కు ముచ్చటేసి ‘రంగస్థలం’ స్టయిల్లోనే అయాన్ కు రెండు జతల బట్టలు కుట్టించి ఇవ్వడం.. అందులో ఒక డ్రెస్ వేసుకుని అయాన్ ఫొటోలు దిగడం.. అవి సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. ఇప్పుడు అయాన్ కు సంబంధించి ఒక వీడియో కూడా ఇలాగే వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో అయాన్ తో పాటు వెనుక అతడి తల్లి.. చెల్లి కూడా కనిపిస్తున్నారు. బన్నీ ఇంట్లో తీసిన వీడియో ఇది. అందులో బన్నీ వాయిస్ కూడా వినిపించింది. బన్నీ నీకే పాట కావాలని అడగడం.. అయాన్ ‘రంగా రంగా రంగస్థలాన’ అంటూ పాట అందుకుని డ్యాన్స్ చేస్తూ ఊగిపోవడం.. ఈ సినిమాలో ఎవరున్నారు అని అడిగితే.. అయాన్ ‘చిన్న మామ’ అనడం ఈ వీడియోలో రికార్డయింది. ఈ వీడియోను బన్నీనే రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం విశేషం. మెగా అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. బన్నీతో రెండు సినిమాలు చేసిన సుకుమార్.. రామ్ చరణ్ తో తొలిసారి తీసిన చిత్రం ‘రంగస్థలం’. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి