Begin typing your search above and press return to search.
స్పేస్ కోసం వస్తున్న అల్లు అర్జున్
By: Tupaki Desk | 4 April 2019 5:56 AM GMTనా పేరు సూర్య తర్వాత నెలలు కాదు ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో మొదలుకానున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అవుతున్నప్పటికీ స్క్రిప్ట్ విషయంలో రాజీ పడటం ఇష్టం లేకే బెస్ట్ వెర్షన్ కోసం పలు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నట్టు సమాచారం. ఏప్రిల్ 24న దీన్ని లాంచనంగా మొదలుపెట్టబోతున్నారు. అధికారిక ప్రకటన బన్నీ బర్త్ డే 8న వస్తుంది.
అయితే దాని కన్నా ముందు ఎల్లుండి 6వ తేది ఓ ఓపెనింగ్ కోసం బన్నీ బయటికి రాబోతున్నాడు. హీరో నవదీప్ మరికొందరి భాగస్వామ్యంతో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 47 సైలెంట్ వ్యాలి లో కొత్తగా స్థాపించబడిన 'సి' స్పేస్ సెంటర్ ఓపెనింగ్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి
సి స్పేస్ ని టాలెంట్ హబ్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం. మూడంతస్తుల భవనంలో వివిధ సినిమా విభాగాల కోసం కేటాయించబడిన స్పేస్ ఇక్కడ ప్రత్యేకంగా అద్దెకు ఇస్తారు. వివిధ రకాల సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.అంతే కాదు ఏదైనా కంటెంట్ ఉన్నా స్క్రిప్ట్ ఉన్నా ఇక్కడ సంప్రదిస్తే నిర్మాణ సంస్థలు సాంకేతిక నిపుణుల మధ్య ఇది వారధిగా కూడా పనిచేయబోతున్నట్టు తెలిసింది.
గీత కాంపౌండ్ కు చెందిన ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఇందులో భాగస్వామిగా ఉండటంతో దీనికి బన్నీ గెస్ట్ గా వచ్చేందుకు ఒప్పుకున్నట్టు టాక్. సో ఆ రోజు త్రివిక్రమ్ సినిమాలో తన లుక్ ఎలా ఉండవచ్చు అనే క్లారిటీ రావొచ్చు. ఈసారైనా బన్నీ చేయబోయే సినిమాల గురించి విడుదల గురించి ఇంకొంత క్లారిటీ ఇస్తే బెటర్. లేదంటే తమ ఎదురు చూపులకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో తెలియక ఫ్యాన్స్ నీరసబడిపోతారు.