Begin typing your search above and press return to search.
మగవాళ్లలో అతనికే ఐలవ్యూ -బన్నీ
By: Tupaki Desk | 30 July 2017 5:11 AM GMTమన తెలుగులో ఇప్పుడు కొత్త ప్రచార ప్రక్రియలు మొదలయ్యాయ్. ఒక స్టార్ సినిమాను మరో స్టార్లు ప్రోమోట్ చేయడాలు, తెలిసిన వారి సినిమాను ఒక పెద్ద స్టార్ చే ప్రచారం చేపించడం కొంచం పెరిగాయి. ఇది చాల రకాలుగా మంచి పరిణామమే. ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు కి సరైన గుర్తింపు లేక ప్రచారం దొరకక వాళ్ళ సినిమా జనాలకు చేరవలిసినంత చేరదు. ఇప్పుడు ఒక చిన్న సినిమాని ఒక పెద్ద డైరెక్టర్ నిర్మించగా దానికి మరో స్టార్ హీరో ప్రచారం చేస్తున్నాడు.
దర్శకుడు అనే సినిమాను సుకుమార్ నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా పాటలు విడుదల దగ్గర నుంచి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు అన్ని కొత్తగానే చేశాడు సుకుమార్. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన అల్లు అర్జున్.. సుక్కూ గురించి భలే కామెంట్లే చేశాడు. “సుకుమార్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే అది నా సినిమా కిందే లెక్క ఎందుకంటే సుకుమార్ నావాడు. తనకి నాకు అంతా అనుబంధం ఉంది. నాకు మగవాళ్ళ లో ఎవరికైన ఐ లవ్ యు చెప్పాలి అంటే అది ఒక్క సుకుమారుకే చెబుతాను'' అనేశాడు బన్నీ.
''దర్శకుడు గురించి చెప్పాలి అంటే నా దృష్టి లో సినిమాలో చాలా క్రాఫ్ట్ లు ఉంటాయి కదా వాళ్లందరికి లైఫ్ ఇచ్చేవాడే దర్శకడు. ఇంకోటి కూడా చెప్పాలి దర్శకుడు చేసే పనిలో అతి కష్టమైన పని ఒకటి ఉంటుంది అదే సెట్ లో చేసే ఈగో మేనేజ్ మెంట్. దర్శకుడు అందరితో కలిసి పని చేయాలి వాళ్ళ ఈగోని సంతృప్తిపరచాలి. ఇది సినిమాను డైరక్షన్ చేయడం కంటే కష్టమైన పని'' అన్నాడు అల్లు అర్జున్. అలా చెబుతూ తెలుగు హీరోయిన్ ఈషాకు తన శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే హీరో కి మిగతా క్రియేటివ్ టీమ్ కి డైరెక్టర్ హరి ప్రసాద్ కి తన శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక అక్కడకొచ్చిన ఫ్యాన్స్ ఆర్య 3 అంటుంటే.. ''ఆర్య లో హీరో కొంచెం తిక్క ఆర్య 2 లో అది మరి కాస్త పెరిగింది. ఇప్పుడు ఆర్య 3 తీయాలి అంటే పిచ్చివాడి మీద సినిమా తీయాలి. సుకుమార్ కథ చేస్తే నేను సిద్దమే'' అంటూ ముగించాడు బన్నీ.