Begin typing your search above and press return to search.
మాటలతో మాయ చేసిన బన్నీ
By: Tupaki Desk | 30 April 2018 8:46 AM GMTనా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా మే 4న విడుదల కానుంది. ఇందుకోసం ప్రి రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రామ్ చరణ్ వచ్చాడు. నా పేరు సూర్య టీమ్ యూనిట్ అంతా హాజరైంది. ఈ సందర్భంగా బన్నీ అదిరిపోయేలా స్పీచ్ ఇచ్చాడు. ఎప్పుడూ మైక్ అందుకున్నా ఏదో ఒకటి ఓ రెండు నిమిషాలు మాట్లాడి ఆపేసేవాడు. కానీ ఈ సారి మాత్రం ఆపకుండా మాట్లాడుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు.
అందరికంటా ముందు తాను థ్యాంక్స్ చెప్పాల్సింది భారత సైన్యానికని వారే మద్దతు ఇవ్వకుంటే ఈ సినిమా ఉండదని బన్నీ తెలిపాడు. సూర్య సినిమా కథను తన వద్దకు తెచ్చింది నల్లమలుపు బుజ్జి అని అతని కోసం తాను ఏదో ఒకటి భవిష్యత్తులో చేసి తీరాని ఏం చేస్తానో మాత్రం చెప్పనని అన్నాడు బన్నీ. ఎందుకంటే ఆ సినిమా కథను తనకు ఇచ్చేయని అడగ్గానే ఆయన మారు మాటాడకుండా ఇచ్చేశారని చెప్పుకొచ్చాడు. అలాగే నిర్మాతలు శ్రీధర్ - నాగబాబు- బన్నీ వాసులు ఒక కొత్త డైరెక్టర్‌తో సినిమా అని తెలిసి కూడా ఖర్చుపెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడలేదని అన్నాడు. వారికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇక బన్నీ వాసును తాను ఎంత ఏడిపించానో తనకే తెలుసని అవన్నీ బన్నీ వాసు భరించాడని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అలాగే సినిమాలో నటించిన సీనియర్ హీరోలు అర్జున్ శరత్ కుమార్‌లకు కూడా థ్యాంక్స్ చెప్పాడు.
తెలుగు సాహిత్యాన్ని మనకి మనమే ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సినిమాల ద్వారా ఆ పనిని ముందుకుతీసుకెళ్లాలని అందరిని కోరుకుంటున్నట్టు చెప్పారు. సినిమా హిట్ కొడితే ఆ ఘనత మొత్తం డైరెక్టర్ వక్కంతం వంశీకే చెందుతుందని అన్నారు. రంగస్థలం ఆ తరువాత విడుదలైన భరత్ అనునేను ఎలా హిట్ కొట్టాయో ఆ హిట్ ను నా పేరు సూర్య కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. తన సినిమా తరువాత విడుదలయ్యే సినిమాలు మెహబూబా మహానటి లు హిట్ కొట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. మొత్తమ్మీద బన్నీ ఏ పాయింట్ వదకుండా మాట్లాడేశాడు.