Begin typing your search above and press return to search.
డీజే ఖాతాలో అరుదైన రికార్డు
By: Tupaki Desk | 28 Jan 2019 5:18 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డీజే- దువ్వాడ జగన్నాధం'. సినిమా రిలీజ్ అయిన సమయంలో అంచనాలు అందుకోలేకపోయింది గానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్సే వసూలు చేసింది. దాదాపు 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బన్నీ సత్తాను చాటిన చిత్రమిది. ఈ సినిమా తాజాగా యూట్యూబ్ లో ఒక అరుదైన రికార్డ్ సాధించింది.
ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు అనే సంగతి తెలిసిందే. ఆయన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో 'దువ్వాడ జగన్నాధం' ఇప్పటివరకూ 50 మిలియన్స్ వ్యూస్ మార్క్ ను దాటేసింది. ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాకు129k లైక్స్ కూడా రావడం విశేషం. మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్ ను గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ వారు తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేయగా ఈ సినిమా 72 మిలియన్లకు పైగా వ్యూస్.. 223k లైక్స్ సాధించింది.
అల్లు అర్జున్ సినిమాలకు మొదటినుంచి యూట్యూబ్ లో ఆదరణ ఎక్కువే. ముఖ్యంగా హిందీ వెర్షన్ వ్యూస్ నంబర్ కనుక చూస్తే ఎవరికైనా మతిపోవడం ఖాయం. 'సరైనోడు' హిందీ వెర్షన్ ను డిసెంబర్ 15 న గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ వారు తమ ఛానల్ లో అప్లోడ్ చేస్తే ఇప్పటికే 25 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది.