Begin typing your search above and press return to search.
బన్నీ కోటింగ్ ఇచ్చేశాడు బ్రదర్!!
By: Tupaki Desk | 18 May 2016 3:39 PM GMTఅందరూ ఊహించినట్లు.. ''చెప్పను బ్రదర్'' కాంట్రోవర్శీ గురించి కాస్త గట్టిగానే స్పందించాడు మెగా హీరో. డైరెక్టుగా ఫ్యాన్సుతోనే మాట్లాడాలని.. ఈ ''చెప్పను బ్రదర్'' అనే విషయాన్ని నేను మీడియా ముందు మాట్లాడలేదు అంటూ తన స్పీచ్ మొదలెట్టాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే అందరికీ ''అందరికీ రౌండప్ ఇచ్చే వెళతాను బ్రదర్'' అంటూ అసలు తాను పవర్ స్టార్ గురించి మాట్లాడకపోవడానికి కారణం.. ఏంటో చెప్పుకొచ్చాడు.
''మీరు పవర్ స్టార్ అని అరిచినప్పుడు.. నేను మాట్లాడకుండా వెళ్లిపోవడానికి కారణం.. మీరే.. పవర్ స్టార్ గారు కాదు.. మీ అరుపులే కారణం..'' అంటూ మొదలు పెట్టాడు బన్నీ. అంతే కాదు.. ఒక పెద్ద దర్శకుడు 100 రోజులు టైమ్ ఇన్వెస్ట్ ఇచ్చి.. ఎంతో కష్టపడి సినిమా తీస్తే.. ఆయన మాట్లాడుతున్నప్పుడు అరవడం సమంజసం కాదంటూ ఫ్యాన్సుకు క్లాసు పీకాడు. ''అవతల హీరోల ఫ్యాన్సుకు కూడా మనం రెస్పక్ట్ ఇవ్వాలి'' అని చెప్పుకొచ్చాడు. బన్నీ దగ్గర ఎవరో మాట్లాడుతూ.. 'సార్ పవన్ అంటే మాకూ ఇష్టమే కాని. మాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. మీవాళ్లు ఏంటి సార్ ఇలా చేస్తున్నారు' అంటూ కామెంట్ చేశారని బన్నీ చెప్పాడు.
ఇక చిరంజీవి అండ్ పవన్ గురించి మాట్లాడుతూ.. ''కళ్యాణ్ గారు కొన్ని వందలసార్లు చెప్పాడు మా అన్నయ్య వలనే ఈ పొజిషన్ లో ఉన్నాను అని. ఇక చిరంజీవి గారంత స్టేచర్ ఉన్న వ్యక్తిని మీరు మాట మాట్లాడనీయకుండా అరుస్తున్నారు చూడండి.. అది అసలు బాగాలేదు. ఇవాళ మనం ఇలా అరవడానికి ఒక స్టేజ్ క్రియేట్ చేసిచ్చింది చిరంజీవి గారు. ఆయన్ను మీరు గౌరవించకుండా అరుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. హర్టయ్యాను. అందుకే మీరు అడిగినప్పుడు నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు కూడా కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడను. ఎందుకంటే రప్చర్ అయ్యింది కాబట్టి.. బటర్ పూసినట్లు ఉంటుంది'' అంటూ స్ర్టయిట్ గా తన మనస్సులో మాట చెప్పేశాడు బన్నీ.
''మూడు హిట్లు కొట్టాడు కాబట్టి.. వీడు ఎక్కువ చేస్తున్నాడు అని మీరు అనుకున్నా కూడా.. నేను నా మీద నెగెటివ్ ఫోర్స్ వేసుకుని కావాలనే చేశాను. చిరంజీవి గారి కోసం ఇలా చేశాను'' అని చెప్పాడు.
ఇక ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ.. ''దయ చేసి మీరు మీ అల్లరిని ఒక లిమిట్ ను పెట్టుకోండి. సోషల్ మీడియాలో వెర్బల్ వార్ ఆపండి. చాలా చీప్ గా ఉంది. మీలో మీరు చాలా గ్రూప్స్ ఉండొచ్చు.. కాని మేమంతా ఒక ఫ్యామిలీ. సో.. ఆపేయండి'' అంటూ.. ఒక్కసారి ''పవర్ స్టార్'' అని చెప్పి వెళ్ళిపోయాడు.