Begin typing your search above and press return to search.

అర్హ తో పుష్ప సండే స్పెషల్‌

By:  Tupaki Desk   |   7 Feb 2022 4:47 AM GMT
అర్హ తో పుష్ప సండే స్పెషల్‌
X
టాలీవుడ్ స్టార్‌ హీరోలు ఒకప్పుడు తమ ఫ్యామిలీ విషయాలను.. పిల్లలకు సంబంధించిన విషయాలు మరియు ఫొటోలు వీడియోలను పెద్దగా బయటకు షేర్ చేసేందు.. అభిమానుల ముందు ఉంచేందుకు ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు స్టార్‌ హీరోలు అంతా కూడా సోషల్‌ మీడియా ద్వారా తమ పిల్లలు మరియు ఇతర ఫ్యామిలీ ముచ్చట్లను రెగ్యులర్ గా అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉన్నారు.

ఒక వేళ హీరోలు షేర్‌ చేయకున్నా వారి కుటుంబ సభ్యులు లేదా హీరో గారి వైఫ్‌ అయినా ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ సినీ ప్రియులను మరియు అభిమానులను ఎంటర్‌ టైన్ చేయడం జరుగుతుంది. మహేష్‌ బాబు పిల్లలతో సందడి చేసే ఫొటోలను ఎలా అయితే నమ్రత షేర్‌ చేస్తారో అలాగే బన్నీ పిల్లలతో ఆడుకుంటూ ఉండే ఫొటోలు వీడియోలను స్నేహా రెడ్డి మెగా అభిమానుల కోసం షేర్‌ చేస్తూ ఉన్నారు.

తాజాగా అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి మరో వీడియోను షేర్‌ చేశారు. గత ఆది వారం అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి ఏదో యాక్టివిటీ చేస్తూ కనిపించాడు. ఈ ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్న వీడియోను ఆమె షేర్ చేశారు. ఆ వీడియోలో అల్లు అర్హ పరిగెత్తుతూ ఉంటే ఆమెను పట్టుకునేందుకు సరదాగా బన్నీ కూడా పరిగెత్తడం ఆ వీడియోలో చూపించడం జరిగింది. అర్హ మరియు అల్లు అర్జున్‌ ల వీడియో ఎప్పుడు వచ్చినా కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది అనడంలో సందేహం లేదు. క్యూట్‌ అర్హ పాప యొక్క ఈ కొత్త క్యూట్‌ వీడియో కూడా సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ అవుతూ ఉంది. అందరి దృష్టిని ఆకర్షిస్తూ వావ్‌ క్యూట్‌ అంటూ కామెంట్స్‌ ను దక్కించుకుంది.

పుష్ప సినిమా హడావుడి నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న అల్లు అర్జున్ అతి త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక వైపు పుష్ప సినిమా పార్ట్‌ 1 సోషల్‌ మీడియాలో సెన్షేషన్ క్రియేట్‌ చేస్తున్న సమయంలోనే పుష్ప పార్ట్‌ 2 ను విడుద లచేయాలనే ఉద్దేశ్యంతో సుకుమార్‌ ఉన్నాడు. అందుకే షూటింగ్‌ ను జెట్‌ స్పీడ్‌ తో ముగించి ఇదే ఏడాది చివర్లో డిసెంబర్‌ నాటికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

పుష్ప పార్ట్‌ 1 ఏకంగా 350 కోట్ల వసూళ్లు సాధించడంతో రెండవ పార్ట్‌ పై చాలా పెద్ద భారమే ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్‌ ఆ భారంను ఎలా మోస్తారు.. 300 కోట్ల వసూళ్లు మళ్లీ సాధ్యమా అనేది చూడాలి.