Begin typing your search above and press return to search.

స్పెషల్ ఏంటి బన్నీ గారు?

By:  Tupaki Desk   |   23 Dec 2017 11:25 AM GMT
స్పెషల్ ఏంటి బన్నీ గారు?
X
అందరు హీరోలు ఒకలా వెళుతుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం మరొకలా వెళుతున్నాడు. ఈ ఏడాది డీజే తో వచ్చిన బన్నీ సైలెంట్ గా నా పేరు సూర్య షూటింగ్ ని నడిపించేస్తున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ దాదాపు 70% అయిపోయినా కూడా ఇంకా సినిమాకు సంబందించిన ఎటువంటి విషయాన్ని చెప్పడం లేదు.

అప్పుడెప్పుడో టైటిల్ ని బయటపెట్టారు. ఇక షూటింగ్ సగానికి వచ్చినా కనీసం అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయలేదు. దీంతో బన్నీ అభిమానులు ఏదైనా వదలండి బాబు అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ రోజు నైట్ 10.30 గంటలకు సినిమాకు సంబందించిన ఒక విషయాన్ని బయటపెడతారట.

అయితే ఏంటా స్పెషల్ అనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ అభిమానులకే వదిలేసింది. తప్పకుండా కొందరు ఫస్ట్ లుక్ అయ్యి ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ని చెప్పేందుకె ఆ స్పెషల్ అంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ స్పెషల్ ఏమిటో గాని కొంచెం అభిమానుల అంచనాలకు అందేట్టు ఇస్తే బావుండు..చూడాలి మరి అల్లు అర్జున్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో..?