Begin typing your search above and press return to search.
తన పై తానే పంచ్ లు వేస్కున్నాడా?
By: Tupaki Desk | 12 Dec 2019 6:00 AM GMTపంచ్ లు వేయడం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తర్వాతనే. టైమ్ చూసి టైమింగుతో పంచ్ లు విసరడంలో మొనగాడు. ఆయన కలం పవర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. సరైన రైమింగ్ టైమింగు లేనిదే ఆయన డైలాగులు ఉండవు. తొలి నుంచి ఆయన ఇదే బాణీని అనుసరిస్తున్నారు.
ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రానికి అది మినహాయింపేమీ కాదు. ఇక బన్ని తనపై తానే పంచ్ లు వేసుకుంటూ జనాలకు ఇస్తున్న మెసేజ్ లపై ఒకటే సందేహం కలుగుతోంది. ఇంతకు ముందు టైటిల్ టీజర్ వదిలినప్పుడు `గ్యాప్ తీస్కోలా.. వచ్చింది!` అంటూ తనపై తానే పంచ్ వేసుకున్నాడు బన్ని. నా పేరు సూర్య డిజాస్టర్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ స్క్రిప్టు కోసం అల్లు అర్జున్ రకరకాల డైలమా నడుమ చాలా గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాను గ్యాప్ తీసుకోలేదని.. దానంతట అదే వచ్చిందనే అర్థంలో ఆ పంచ్ వేశారు.
తాజాగా వచ్చిన టీజర్ లోనూ బన్ని మరో పంచ్ వేశాడు. పాటలతో బాగా ప్యాక్ చేశాం గా.. ఇంకేం కావాలి? డైలాగ్ లేదనా? అంటూ ఓ పంచ్ విసిరాడు. అయితే అల వైకుంఠపురములో టీజర్లలో బన్ని ఫ్యాన్స్ ఆశించిన ఆ రేంజు పంచ్ డైలాగ్ ఏదీ లేదు. దానికి కూడా తనపై తానే పంచ్ వేస్కున్నాడు! అని అర్థమవుతోంది. లిరికల్ వీడియోలతో హీట్ పెంచినా.. టీజర్లలో ఇంకా త్రివిక్రమ్ మార్క్ భారీ పంచ్ లు కోరుకునేవారికి ఆ సందేహాన్ని క్లియర్ చేసేందుకే ఇలాంటి ఓ డైలాగ్ క్రియేట్ చేశారా? అనిపిస్తోంది. ఈ డైలాగులు కేవలం ప్రచారం కోసం జిమ్మిక్కా? అన్న ముచ్చటా సాగుతోంది. ఈ ప్రశ్నలకు త్రివిక్రమ్ సమాధానం ఇస్తారేమో చూడాలి.