Begin typing your search above and press return to search.

బన్నీ మాట్లాడ్డానికి ఆ నలుగురే కారణం

By:  Tupaki Desk   |   26 Jun 2016 4:28 AM GMT
బన్నీ మాట్లాడ్డానికి ఆ నలుగురే కారణం
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఈ మధ్య హిట్లే కాదు.. అవార్డులు రివార్డులు కూడా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. వరుసగా సాధిస్తున్న సక్సెస్ లు క్రేజ్ నే కాదు.. అనేక అవార్డులను తీసుకొస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన సినీ మా అవార్డ్స్ లో.. బన్నీకి ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ అందుకున్నాడు. రుద్రమ దేవిలో చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు గాను ఈ అవార్డ్ వచ్చింది.

ఈ సినిమాలో బన్నీ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల చెవుల్లో తిరుగుతూనే ఉంటాయి. 'నేను తెలుగు బాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా', 'గమ్మునుండవాయ్' డైలాగ్స్ కు థియేటర్లలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఏ స్టేజ్ ఎక్కినా.. అల్లు అర్జున్ ని ఈ డైలాగ్ చెప్పమంటూ డిమాండ్స్ వస్తున్నాయ్. వన్స్ మోర్లు పడుతున్నాయి. రుద్రమదేవిలో ఈ పాత్రకు సంబంధించి.. అంత పర్ఫెక్ట్ గా ఆ డైలాగ్స్ చెప్పగలగడానికి ఓ నలుగురు కారణం అంటున్నాడు బన్నీ.

'చేవెళ్ల రవి-రైటర్ రాజసింహ- డబ్బింగ్ ఇన్ ఛార్జ్ పప్పు- జబర్దస్త్ కమెడియన్ వేణుల సహకారంతోనే అంతగా చెప్పగలిగాను. నేను ఆ నలుగురికీ థ్యాంక్స్ చెప్పాలి. తెలంగాణ యాసను మాండలికాన్ని అంత చక్కగా పలకగలిగేందుకు వారే కారణం. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కు కృతజ్ఞతలు' అని చెప్పాడు బన్నీ. చిరు చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నా.. ఆయన బుగ్గకు బన్నీ ఓ ముద్దు పెట్టడం అందరినీ ఆకట్టుకుంది.