Begin typing your search above and press return to search.

నో డౌట్‌.. ''వస్తున్నాడు బ్రదర్‌''

By:  Tupaki Desk   |   17 May 2016 5:30 PM GMT
నో డౌట్‌.. వస్తున్నాడు బ్రదర్‌
X
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కళ్ళన్నీ స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ మీదనే ఉన్నాయి. మనోడు ఈ మధ్యన ఒకటికి రెండుసార్లు చేసిన ''చెప్పను బ్రదర్‌'' కామెంట్‌.. కాస్త గట్టిగానే రాజుకుంది. చెప్పడం చెప్పకపోవడం అనేది అతని పర్సనల్‌ అయినా కూడా.. ప్యాన్సు మాత్రం రెండు గ్రూపులుగా విడిపోయి.. ఆరోపణల పర్వం మొదలెట్టేశారు.

మరి ఈ బుధవారం (మే 18) మెగా డాటర్‌ కొణిదెల నిహారిక అఫీషియల్‌ లాంచ్ ప్రోగ్రామ్‌ ఉంది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ వస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అదే విషయాన్ని నిహా సొంత అన్న వరుణ్‌ తేజ్‌ కూడా కన్ఫామ్‌ చేశాడు. అయితే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఏదైనా గోల చేస్తారేమోనని.. అల్లు అర్జున్‌ ఈ కార్యక్రమానికి డుమ్మా కొడతాడు అంటూ సోషల్‌ మీడియాలో ఒక ప్రచారం మొదలైపోయింది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అబ్బే అదేం లేదట. యథావిథిగా ఈ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ - వరుణ్‌ - సాయిధరమ్‌ - శిరీష్‌ లతో పాటు.. అల్లు అర్జున్‌ కూడా ''వస్తున్నాడు బ్రదర్‌'' అంటున్నారు బన్నీ అభిమానులు.

ఒకవేళ మరి పవన్‌ ఫ్యాన్స్‌ యాజూజువల్‌ తమ అలవాటును మార్చుకోకుండా.. ''పవర్‌ స్టార్‌'' అని అరుస్తుంటే.. అప్పుడు బన్నీ ఏం సమాధానం చెబుతాడు? వారికి ఏదైనా ఎక్సప్లనేషన్‌ వంటిది ఇస్తాడా లేకపోతే ఎప్పటిలాగానే చెప్పను బ్రదర్‌ అనేసి వెళ్ళిపోతాడా అనేది చూడాలి మరి.