Begin typing your search above and press return to search.

క్రిస్మస్ సీజన్ కి బాలీవుడ్ బడా స్టార్ తో ఢీ కొట్టబోతున్న అల్లు అర్జున్ !

By:  Tupaki Desk   |   4 Aug 2021 11:31 AM IST
క్రిస్మస్ సీజన్ కి బాలీవుడ్ బడా స్టార్ తో ఢీ కొట్టబోతున్న అల్లు అర్జున్ !
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తొలి పాన్ ఇండియా ఫిలిం పుష్ప కోసం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. హీరోలని సరోకొత్తగా చూపిస్తాడని పేరొందిన సుకుమార్ పుష్ప కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 తరువాత బన్నీ, సుక్కు కలిసి పని చేస్తున్న చిత్రం పుష్ప.

పుష్ప రెండు భాగాల్లో రాబోతుంది. మొదటి భాగం పుష్ప- ది రైజ్ ఈ సంవత్సరం క్రిస్మస్ కి విడుదలవుతుంది. మొత్తంగా ఐదు భాషల్లో పుష్ప విడుదలకి సన్నద్ధం అవుతుంది.

క్రిస్మస్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ ఆడించిన రికారున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కూడా తన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా ని అదే సీజన్ లో తీసుకురాబోతున్నాడు. ప్రేక్షకులకు రెండు భారీ చిత్రాల మధ్య భారీ పోటీ చూసే అవకాశం ఉంది.

రెండూ భారీ చిత్రాలే. పుష్ప ఐదు భాషాల్లో వస్తుంటే, లాల్ సింగ్ చద్దా కూడా బహు భాషల్లో వచ్చే అవకాశం ఉంది. హిందీ లో పెద్ద ఎత్తున విడుదలయ్యే లాల్ సింగ్ చద్దా, తెలుగు లో కూడా విడువలయ్యే అవకాశం లేకపోలేదు. నాగ చైతన్య ఈ చిత్రంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నాడు.

అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం తో ఎలాంటి సంచలనాలు చేస్తాడో చూడాలి మరి. అవకాశం వస్తే, పూర్తి హిందీ చిత్రంలో నటించాలనుందని అల్లు అర్జున్ ఇటీవల తన మనసులో మాట బయట పెట్టారు.