Begin typing your search above and press return to search.
మాస్ లుక్ కి 6 ప్యాక్ జోడిస్తే తెరపై దుమారమే
By: Tupaki Desk | 4 July 2020 5:15 AM GMTసిక్స్ ప్యాక్ లుక్ అంటే తొలిగా గుర్తుకొచ్చేది `దేశముదురు` సినిమానే. ఆ మూవీ కోసం బన్ని ఎంతో రిస్క్ చేసి 6 ప్యాక్ చేశాడు. హిమాలయాల్లో మంచు కురిసే చోట మైనస్ డిగ్రీల చలిని లెక్క చేయక బన్ని నిరంతరం జిమ్ చేసేవాడని పూరి అప్పట్లో తెలిపారు. అంతటి కమిట్ మెంట్ ఉన్న హీరో కాబట్టే ఎందరు స్టార్లు ఉన్నా.. ఇంతింతై అన్న చందంగా పరిశ్రమలో ఎదిగాడు. అగ్ర కథానాయకుల జాబితాలో అతడి స్థానం పదిలంగా ఉంది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో బన్ని కండలు పెంచి కనిపించినా చొక్కా విప్పి ఫైట్స్ చేసింది మాత్రం బద్రీనాథ్ చిత్రంలో. అందులో అతడి 6 ప్యాక్ లుక్ మరోసారి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఇటీవల `నా పేరు సూర్య`లో ఆర్మీ మ్యాన్ గా అదిరిపోయే లుక్ లో కనిపించాడు. అయితే మధ్యలో త్రివిక్రమ్ మాత్రం బన్ని ఇమేజ్ కి భిన్నమైన పాత్రల్ని ఆఫర్ చేసి అతడిని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. బోయపాటి.. హరీష్ శంకర్ లాంటి దర్శకులు మాస్ లుక్ లనే డిజైన్ చేశారు బన్ని కోసం.
ఇప్పుడు మరోసారి బన్ని 6 ప్యాక్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అతడు `పుష్ప` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్య- ఆర్య 2 లాంటి క్లాసిక్ చిత్రాల్ని తెరకెక్కించిన సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో అందరిలో ఒకటే ఆసక్తి. ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప లుక్ చూశాక బన్ని ఈ చిత్రంలో రగ్గుడ్ గా మాస్ లుక్ లో కనిపిస్తాడని అర్థమైంది. అయితే మాస్ అవతారంలో కనిపిస్తూనే సిక్స్ ప్యాక్ యాబ్స్ తో బన్ని మెరుపులు మెరిపిస్తాడట. పుష్ప హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్. అందుకే ఈ జాగ్రత్త. యూట్యూబ్ లో హిందీ డబ్బింగులతో ఉత్తరాదినా పాపులరైన బన్ని తొలిసారిగా హిందీ మార్కెట్ ని టార్గెట్ చేయనున్నాడు. పాన్ ఇండియా కేటగిరీలో పుష్పని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అందుకే ఇప్పుడు బన్ని లుక్ విషయంలో ఏమాత్రం రాజీకి రాకుండా హార్డ్ వర్క్ చేస్తున్నాడట.