Begin typing your search above and press return to search.

బన్నీ ‘పుష్ప’ కోసం అంత తీసుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   22 Jun 2020 11:30 PM GMT
బన్నీ ‘పుష్ప’ కోసం అంత తీసుకుంటున్నాడా?
X
ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అల వైకుంఠపురంలో కు దక్కింది. సంక్రాంతికి విడుదలైన బన్నీ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. మార్చి నుండి మహమ్మారి వైరస్‌ కారణంగా సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. ఈ ఏడాది పెద్ద సినిమాలు ఇక విడుదల అవుతాయనే నమ్మకం కూడా లేదు. అల వైకుంఠపురంలో చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ దక్కించుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అల వైకుంఠపురంలో చిత్రంను అల్లు అరవింద్‌ ఇంకా రాధాకృష్ణు కలిసి నటించారు. ఆ సినిమాకు గాను బన్నీ 25 కోట్ల పారితోషికం ఇంకా లాభాల్లో 25 శాతం వాటాను దక్కించుకున్నాడట. అంటే బన్నీకి భారీ మొత్తంలోనే అల వైకుంఠపురంలో చిత్రంతో దక్కిందన్నమాట. ఆ సినిమా తెచ్చిన ఇమేజ్‌ తో పాటు పుష్పను పాన్‌ ఇండియా మూవీగా ప్లాన్‌ చేస్తున్నారు కనుక ఏకంగా ఈ చిత్రం కోసం 35 కోట్ల పారితోషికం ఇంకా లాభాల్లో పాతిక శాతం వాటాను తీసుకోబోతున్నాడట.

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ గా ఎర్ర చందనం స్మగ్లర్‌ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సుకుమార్‌ రంగస్థలం చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం అవ్వడంతో పుష్ప మరో ఇండస్ట్రీ హిట్‌ గా నిలుస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోలో అడవి సెట్టింగ్‌ ను భారీ ఖర్చుతో ఏర్పాటు చేయించబోతున్నారట. ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా నటించబోతుంది. బాలీవుడ్‌ స్టార్‌ ను ఈ చిత్రంలో విలన్‌ గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.