Begin typing your search above and press return to search.

HBOలో కూడా బన్నీ ఎటాక్

By:  Tupaki Desk   |   28 April 2018 4:33 AM GMT
HBOలో కూడా బన్నీ ఎటాక్
X
అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య.. వచ్చే వారంలో థియేటర్లలోకి వస్తోంది. మే 4వ తేదీని విడుదల అవుతున్న ఈ చిత్రంపై అంచనాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమ్మర్ లో రంగస్థలం.. భరత్ అనే నేను తర్వాత మూడో బ్లాక్ బస్టర్ టాలీవుడ్ కు అందుతుందనే కాన్ఫిడెన్స్ ట్రేడ్ జనాల్లో కనిపిస్తోంది.

ఇవాల్టి రోజుల్లో ప్రమోషన్స్ అంటే వైవిధ్యం కంపల్సరీ. ప్రతీ సినిమాకు ఏదో ఒక కొత్త ఎత్తుగడను ప్లాన్ చేస్తున్నారు. నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా చిత్రానికి కూడా ప్రమోషన్ నెక్ట్స్ లెవెల్ లో చేయబోతున్నారు. తెలుగు ఛానళ్లు.. ఇతర ఇండియన్ ఛానల్స్ సంగతేమో కానీ.. ఈసారి ఏకంగా HBO (హెచ్.బి.ఓ) వంటి ఇంటర్నేషనల్ ఛానల్ లోనే ప్రమోషన్స్ నిర్వహిస్తారట. 'ఎక్స్ పీరియన్స్ ద మాజిక్ ఆన్ హెచ్‌.బి.ఓ. ఇండియా' అంటూ ఓ చిన్నపాటి వీడియోను పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. 5 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బన్నీ ఇంటెన్స్ లుక్ తో పాటు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కమింగ్ సూన్.. అని మాత్రమే కనిపిస్తుంది.

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రమోషన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను గమనిస్తే.. ఈ చిత్రం కోసం హెచ్.బి.ఓ. లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చేశాడన్న మాట బన్నీ. ఓ తెలుగు సినిమా కోసం ఏకంగా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం అనే పాయింటే.. అభిమానులకు బోలెడంత జోష్ ఇచ్చేస్తోంది.