Begin typing your search above and press return to search.
మెగా మేనల్లుడి చిత్రానికి సపోర్ట్ గా అల్లు అర్జున్..!
By: Tupaki Desk | 1 Oct 2021 2:30 PM GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ''రిపబ్లిక్'' సినిమా ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షో లతో మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే రోడ్డు ప్రమాదానికి గురై సాయి తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో సినిమాకు ప్రమోషన్స్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మెగా హీరోలతో పాటుగా ఇండస్ట్రీ జనాలు - తేజ్ స్నేహితులు - అభిమానులు ఈ చిత్రానికి తమ వంతు మద్దతు ఇస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా అందరూ 'రిపబ్లిక్' సినిమాపై ప్రేమను చూపించమని కోరారు.
"ఈరోజు 'రిపబ్లిక్' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నా సోదరుడు సాయి తేజ్ ఇక్కడ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ సినిమాపై అభిమానులు & ప్రజలు తమ ప్రేమను మద్దతును తెలియజేయాలని కోరుకుంటున్నాను. దేవకట్టా - ఐశ్వర్య రాజేష్ - రమ్యకృష్ణ మరియు మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు'' అని బన్నీ ట్వీట్ చేశారు. ఇక తేజ్ మేనమామ మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ స్పెషల్ గా ట్వీట్ చేశారు.
''సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు 'రిపబ్లిక్' చిత్ర విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ.. ఆ చిత్ర యూనిట్ సభ్యులందరికీ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ కి 'రిపబ్లిక్' చిత్ర విజయం కూడా కోలుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది అని ఆశిస్తున్నాను'' అని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, 'రిపబ్లిక్' చిత్రానికి దేవకట్టా దర్శకత్వం వహించారు. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ - జగపతిబాబు - శ్రీకాంత్ అయ్యర్ - రాహుల్ రామకృష్ణ - సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె. భగవాన్ - జె. పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.