Begin typing your search above and press return to search.

బన్నీ ఆ ఊరొస్తాడా? లేదా?

By:  Tupaki Desk   |   14 April 2018 9:48 AM GMT
బన్నీ ఆ ఊరొస్తాడా? లేదా?
X
ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు.. పశ్చిమగోదావరి జిల్లాలోని 'మిలటరీ' మాధవరం గ్రామంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక ఈవెంట్ జరగనుంది. ''నా పేరు సూర్య'' సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో.. బన్నీ ఈ గ్రామం గురించి ప్రపంచానికి చెప్పాలని కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే ఈ గ్రామంలో దాదాపు ప్రతీ గడపనుండీ ఒకరు మిలటరీలో ఉన్నారు. అందుకే ఆ గ్రామానికి అంత పేరుంది. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ కూడా ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు కాబట్టి.. ఈ గ్రామం నుండే తన సినిమా ప్రమోషన్లకు కంకణం కడుతున్నాడు.

ఏప్రియల్ 22న మిలటరీ మాధవరం గ్రామంలో ''నా పేరు సూర్య'' సినిమా ఆడియో లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో బన్నీ పాత్రను గురించి చెప్పేముందు.. అక్కడ ఆ గ్రామంలో యుద్దంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తారట. అయితే ఇప్పుడు ఒక సందేహం ఏమిటంటే.. ఈ కార్యక్రమానికి బన్నీ వస్తాడా లేదా అనేది చూడాల్సి ఉందే. ఎందుకంటే అలాంటి పల్లెటూరులో ఇప్పుడు బన్నీ రాక కోసం సెక్యూరిటీ గట్రా ఎరేంజ్ చేయాలంటే కష్టమేనట. అందుకే ఇప్పుడు బన్నీ అక్కడకు రాలేడేమో అంటున్నారు సన్నిహితులు.

ఇకపోతే ఏప్రియల్ 29న హైదరాబాదులో నా పేరు సూర్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. రైటర్ వక్కంతం వంశీ తొలిసారి డైరక్టర్ గా మారుతూ ఈ సినిమాను రూపొందిస్తుండగా.. అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.