Begin typing your search above and press return to search.
డబ్బింగ్ కోసం బన్నీ తిప్పలు
By: Tupaki Desk | 12 May 2017 4:20 AM GMTసాధారణంగా ప్రతీ సినిమాతోనే వేరియేషన్ చూపించడం అల్లు అర్జున్ స్టైల్. స్టైలింగ్.. గెటప్.. హెయిర్ స్టైల్.. మాట తీరు.. వీటిలో కొన్ని అంశాల్లో అయినా కచ్చితంగా ఛేంజ్ ఉంటుంది. రుద్రమదేవి మూవీలో అలనాటి తెలంగాణ యాసలో మాట్లాడి బన్నీ మెప్పించిన తీరు.. మూవీకే హైలైట్ అయిపోయింది.
ఇప్పుడు తన భాషలో మరో యాంగిల్ ని డీజే ద్వారా చూపించాల్సి ఉంది బన్నీ. ఈ సినిమాలో బ్రాహ్మణ వంటగాడి పాత్రలో కనిపించనున్న అల్లు అర్జున్.. ఇప్పటికే ఈ మూవీకి డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టేశాడు. సాధారణంగా డబ్బింగ్ అంటే 2 నుంచి 3 రోజులు మాత్రమే పడుతుంది. కానీ డీజేలో ఈ స్పెషల్ కేరక్టర్ కారణంగా.. ఇప్పటికి 10 రోజులుగా డబ్బింగ్ చెబుతూనే ఉన్నాడట. ప్రతీ పదం పర్ఫెక్ట్ గా వచ్చేవరకూ డబ్బింగ్ చెబుతున్నాడట బన్నీ. మరో కొన్ని రోజులు చెబితే కానీ ఈ పనులు పూర్తి కావని అంటున్నారు. ఉదయం 9.30 నుంచి రాత్రి 9వరకు డబ్బింగ్ స్టూడియోలోనే గడుపుతున్నాడట అల్లు అర్జున్.
మరోవైపు డీజే-దువ్వాడ జగన్నాధం కు ఇంకా క్లైమాక్స్ పార్ట్ పిక్చరైజ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం మేడ్చల్ లోని ఓ ఖాళీ ప్రదేశంలో భారీ సెట్ వేశారు. బన్నీతో పాటు కీలక నటులు అందరూ ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ తో డీజే పూర్తి కానుండగా.. జూన్ 23న దువ్వాడ జగన్నాధం థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/