Begin typing your search above and press return to search.

ఎలాగైనా ‘డీజే’ హిట్ అనిపించాలని..

By:  Tupaki Desk   |   26 Jun 2017 5:12 AM GMT
ఎలాగైనా ‘డీజే’ హిట్ అనిపించాలని..
X
కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా.. సరైన ప్రమోషన్ లేకపోవడం వల్ల దెబ్బ తింటుంటాయి. కానీ కొన్ని సినిమాలకు యావరేజ్.. డివైడ్ టాక్ వచ్చినా పెద్ద రేంజికి వెళ్తుంటాయి. ఈ విషయంలో చిత్ర యూనిట్ చొరవ తీసుకుని ప్రమోషన్ ఎలా చేస్తుందన్నది కీలకం అవుతుంది. తన సినిమాలకు నిర్మాత ఎవరైనా సరే.. అల్లు అర్జున్ ప్రమోషన్ విషయంలో చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంటాడు. నిజానికి అల్లు అర్జున్ గత కొన్నేళ్లలో చేసిన సినిమాలు వేటికీ ప్రేక్షకుల నుంచి పూర్తి సానుకూల స్పందన రాలేదు. ‘రేసుగుర్రం’కు మొదట్లో ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. కానీ రిలీజ్ తర్వాత ప్రమోషన్ గట్టిగా చేయడం కలిసొచ్చింది. ఆపై ‘సన్నాఫ్ సత్యమూర్తి’కైతే నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా నిరాశాజనకంగానే వచ్చాయి. కానీ ఆ సినిమాకు కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు గట్టిగా చేశారు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా సైతం రూ.50 కోట్ల షేర్ క్లబ్బులో చేరడం విశేషం.

గత ఏడాది ‘సరైనోడు’ విషయంలో ఏం జరిగిందో కూడా తెలిసిందే. ఆ సినిమాకు కూడా డివైడ్ టాక్ తప్పలేదు. కానీ ప్రి రిలీజ్.. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు హోరెత్తించేశారు. సినిమా రేంజే మారిపోయింది. పైన చెప్పుకున్న సినిమాలన్నింటికీ రిలీజ్ టైమింగ్ కూడా బాగా కలిసొచ్చింది. వేసవిలో రావడం వల్ల ఈ సినిమాలకు అనూహ్యమైన కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు ‘డీజే’ విషయంలోనూ అల్లు అర్జున్ తనదైన ప్రమోషన్ స్ట్రాటజీని వర్కవుట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. విడుదలకు ముందు ఉన్న హైప్.. భారీ రిలీజ్ వల్ల తొలి వారాంతంలో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ సైలెంటైపోకుండా మీడియాతో చిట్ చాట్లు.. ఇంటర్వ్యూలు కానిస్తున్నాడు. కథానాయిక పూజా హెగ్డేతో కలిసి సందడి చేస్తున్నాడు. హరీష్ శంకర్ ప్రెస్ మీట్ పెట్టి దాన్నో సక్సెస్ మీట్ లాగా మార్చాడు. ఇక సోమవారం పెద్ద రేంజిలో సక్సెస్ మీట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ల ఊపులో వీక్ డేస్ లో కలెక్షన్లను స్టడీగా నిలబెట్టి సినిమా ‘హిట్’ అనిపించడానికి గట్టి ప్రయత్నమే జరుగుతోంది. మరి ‘డీజే’ అంతిమ ఫలితం ఏమవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/