Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ‘సభకు నమస్కారం’

By:  Tupaki Desk   |   1 Aug 2018 1:44 PM IST
అల్లు అర్జున్ ‘సభకు నమస్కారం’
X
‘నా పేరు సూర్య’ అంచనాలు అందుకోకపోవడంతో బన్నీ అప్ సెట్ లో ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా గ్రాండ్ హిట్ తో అభిమానులను అలరించాలని పట్టుదలతో ఉన్నాడు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చినా ప్రయోగాలకు పోకూడదనే ఉద్దేశంతో ఇంకా ఫైనల్ చేయన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం మూవీలో రాంచరణ్ పోషించిన ఊర మాస్ పాత్ర తరహాలో ఓ సినిమా చేయాలని బన్నీ ఎదురుచూస్తున్నట్టు తాజా సమాచారం.

తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఆసక్తికర సబ్జెక్ట్ ను అల్లు అర్జున్ వద్దకు తీసుకొచ్చినట్టు ఫిలింనగర్ టాక్. ఈ ఫుల్ మాస్ కథ బన్నీకి నచ్చిందని.. దీనికి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ కూడా ఉందని వార్తలు వెలువడుతున్నాయి.

అయితే దిల్ రాజు ఈ సబ్జెక్ట్ ను తొలుత నాని హీరోగా తెరకెక్కిద్దామని అనుకున్నాడట.. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. ఇదే కథను అల్లు అర్జున్ లాంటి ఫుల్ జోష్ హీరోతో తీస్తే ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుందని బన్నీకి వినిపించాడట.. చిన్న హీరోలతో సినిమాలు తీసి ప్రమోషన్ చేయడం కష్టమని ఈ మధ్యే దిల్ రాజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అందుకే నాని కంటే బన్నీ బెటర్ అని ఇలా ప్లాన్ చేసినట్టు తెలిసింది.

అయితే ఈ ‘సభకు నమస్కారం’ కథను తీసేందుకు ఇంకా డైరెక్టర్ ఫైనల్ కానట్టు సమాచారం. దిల్ రాజు-బన్నీ కలిసి కొందరు దర్శకుల పేర్లను చర్చించినా ఇంకా కన్ఫం చేయలేదట.. అందుకే బన్నీ ‘గీతాగోవిందం’ ఆడియోలో తన సినిమా ప్రకటనకు ఇంకొంచెం టైం పడుతుందని వ్యాఖ్యానించాడు. దర్శకుడు కన్ఫం అయ్యాక బన్నీ -దిల్ రాజులు ఈ సినిమా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఈ కథతో ఖచ్చితంగా హిట్ కొట్టి మళ్లీ తన మేనియా నిరూపించుకోవాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడట.. మరి బన్నీ కల నెరవేరుతుందో లేదో చూద్దాం మరి..