Begin typing your search above and press return to search.
9 వేల కోట్లు అలా తెచ్చావేంటి డీజే?
By: Tupaki Desk | 26 Jun 2017 7:45 AM GMT‘దువ్వాడ జగన్నాథం’ క్లైమాక్స్ లో చిత్రాలు చూసి జనాలకు రకరకాల ఫీలింగ్స్ కలిగాయి. హీరో విలన్ కొడుకును వెర్రిబాగులోడిని చేసి డబ్బులు కొట్టేసే ఎపిసోడ్ మరీ సిల్లీగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రూ.9 వేల కోట్ల భారీ మొత్తాన్ని చిన్న బొలీరో వ్యాన్లో హీరో పట్టుకొచ్చేయడంలో లాజిక్ జనాలకు అర్థం కావడం లేదు. అల్లు అర్జున్ ఇంతకుముందు చేసిన ‘జులాయి’ సినిమాలో రూ.1500 కోట్లను చాలా పెద్ద కంటైనర్లో తీసుకుపోతారు.
కానీ ‘డీజే’లో దానికి ఆరు రెట్ల డబ్బును చిన్న వ్యాన్లో పట్టుకొచ్చేయడం సిల్లీగా అనిపించింది జనాలకు. అసలు అంత డబ్బును ఎంత పెద్ద నోట్లతో కట్టలుగా పేర్చినా అంత చిన్న వాహనంలో సరిపోయే ఛాన్సే లేదని అంటున్నారు. నిజానికి దీనిపై షూటింగ్ సమయంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. ‘జులాయి’లో మాదిరి హెవీ కంటైనర్ కాకపోయినా.. ఒక డీసీఎం అయినా పెట్టాలన్న చర్చ నడిచిందట.
ఐతే ‘జులాయి’ రోజుల్లో పెద్ద నోటంటే వెయ్యే అని.. ఇప్పుడు 2 వేల నోట్లు వచ్చాయి కాబట్టి చిన్న వెహికలే సరిపోతుందన్న వాదనతో ముందుకెళ్లిపోయాడట హరీష్. కానీ రూ.2 వేల నోట్లయినా కూడా అంత చిన్న వాహనంలో సరిపోయే ఛాన్సే లేదని.. ఈ విషయంలో కొంచెం లాజికల్ గా ఆలోచించి.. పెద్ద వెహికల్ పెట్టాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ‘డీజే’ ఆరంభం నుంచి ఇల్లాజికల్ గానే సాగుతుంది కాబట్టి.. ఇలాంటి చిన్న విషయాల గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/