Begin typing your search above and press return to search.
'పుష్ప' కు అక్కడ కాస్త ఇబ్బంది తప్పదా?
By: Tupaki Desk | 4 Aug 2021 4:16 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ తో కలిసి పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ కు జోడీగా అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా నటిస్తోంది. కాగా పుష్ప సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. దీంతో పుష్ప హంగామా డబుల్ అయింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ ను ఈ క్రిస్ మస్ కు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ క్రిస్ మస్ బరిలో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యలు కలిసి చేస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీ కూడా రిలీజవనుంది.
అల్లు అర్జున్ రేంజ్ కు టాలీవుడ్ లో పర్లేదు కానీ పుష్ప పాన్ ఇండియా మూవీ కాబట్టి టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ కావాల్సి ఉంటుంది. అటువంటిది క్రిస్ మస్ బరిలో లాల్ సింగ్ చద్దా లాంటి భారీ సినిమా ఉంటే పుష్పకు ఉత్తరాదిన గట్టి పోటీ ఎదురవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ అవేయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ దసరా బరిలో, బాలయ్య నటిస్తున్న అఖండ మూవీ కూడా దసరా బరిలోనే ఉంది. అటు తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కల్యాణ్ రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవడంతో పుష్ప మూవీ మేకర్స్ పోటీ ఎందుకని ఆలోచించి దసరా, సంక్రాంతి బరిలో నిలవకుండా మధ్యలో ఉన్న క్రిస్ మస్ కు వచ్చేలా ప్లాన్ చేశారు.
బాలీవుడ్ లో మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మూవీ కూడా క్రిస్ మస్ రోజునే రావడం పుష్ప సినిమా కేవలం టాలీవుడ్ కోసమే మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర భాషల్లో విజయం కూడా తప్పనిసరిగా మారింది. లాల్ సింగ్ చద్దాకు పాజిటివ్ టాక్ వస్తే పుష్పకు వేరే భాషల్లో కలెక్షన్లు వస్తాయా? అని చాలా మంది సినీ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ స్వరాలు సమకూరుస్తున్నాడు.