Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్య కోసం బన్నీ 

By:  Tupaki Desk   |   13 Jan 2023 1:55 PM GMT
వాల్తేరు వీరయ్య కోసం బన్నీ 
X
మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందనే మాట చాలా కాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మెగాస్టార్ నీడ నుంచి బయటకొచ్చి అల్లు అర్జున్ సొంతగా ఎదుగుతూ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే ఒకప్పటిలాగా బన్నీ సినిమా ఫంక్షన్స్ లో మెగాస్టార్ గురించి మాట్లాడటం లేదనేది చాలా మంది మాట. అలాగే రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా కొంత మంది సృష్టించారు.

అయితే దానిపై వాల్తేర్ వీరయ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. తమ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం తమ ఫ్యామిలీ అందరం కలవడం జరిగిందని, బన్నీ కూడా ఆ ఈవెంట్ కి వచ్చాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వాల్తేర్ వీరయ్య మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ చూడటానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రసాద్ మల్టీప్లెక్స్ కి వెళ్ళారు.

ఇప్పుడు బన్నీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫ్యాన్ బాయ్ గా అల్లు అర్జున్ సినిమా చూడటానికి వెళ్ళడం విశేషం. ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటానికి బన్నీ ఆసక్తితో ప్రసాద్ మల్టీప్లెక్స్ కి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

మెగాస్టార్ చివరి నాలుగు సినిమాల కంటే వాల్తేర్ వీరయ్య బాగుందనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. ట్విట్టర్ లో కూడా పలువురు సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవిని మరల పాత రోజుల్లోకి వెళ్లి చూసినట్లు ఉందని పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆడియన్స్ కూడా మళ్ళీ 30 ఏళ్ళ క్రితం చిరంజీవి ఈ సినిమాలో కనిపించాడని చెబుతున్నారు. ఒకప్పటి గ్రేస్, కామెడీ, స్టైల్, యాక్షన్ అన్ని కూడా వాల్తేర్ వీరయ్య సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుంది. ఇక ఫ్యాన్ బాయ్ గా వాల్తేర్ వీరయ్య సినిమా చూసిన అల్లు అర్జున్ సినిమాపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.