Begin typing your search above and press return to search.

అర్హ అల్లరి.. బన్నీ స్నేహ సూపర్ పంచులు

By:  Tupaki Desk   |   9 Feb 2019 6:57 AM GMT
అర్హ అల్లరి.. బన్నీ స్నేహ సూపర్ పంచులు
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తరచుగా ఏదో ఒక అప్డేట్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ నిన్న ఒక క్యూట్ వీడియో ను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో బన్నీ తన ముద్దుల కూతురు అర్హ తో కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఇంకేముంది.. ఆ వీడియో వైరల్ అయింది..

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. బన్నీ ప్రేమగా అర్హను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ "నాన్నా నేను నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను" అని ఒక్కో పదం ఒత్తి పలుకుతూ పాపను చెప్పమన్నాడు. మొదట చెప్పినట్టే చెప్పిన అర్హ ఆ తర్వాత.. "నేను చేసుకోను".. "నేను చేసుకోను" అని పెద్దగా నవ్వుతూ చెప్పింది. ఈ దెబ్బకు బన్నీ కూడా పగలబడి నవ్వాడు. ఇంతటితో స్టొరీ పూర్తి కాలేదు. ఈ వీడియోకు బన్నీ వైఫ్ స్నేహ "నువ్ చేసుకున్నావా మీ నాన్న చెప్పిన అమ్మాయిని?!" అంటూ చురక అంటించింది. ఈ సెటైర్ కు రానా.. మంచు లక్ష్మి లాంటి వాళ్ళు సూపర్ పంచ్ అన్నట్టుగా స్మైలీ ఎమోజిలు పెట్టారు. బన్నీ తమ్ముడు శిరీష్ కూడా అదిరింది అన్నట్టుగా ఒక కామెంట్ పెట్టాడు.

కథ ఇంకా పూర్తి కాలేదు. అక్కడ ఉండేది స్టైలిష్ స్టార్ కదా.. స్నేహ పంచ్ కు తనదైన స్టైల్లో "అబ్బ ఛా.. నువ్వు చేసుకున్నావా ?!" అంటూ రిటర్న్ పంచ్ ఇచ్చాడు. అల్లువారి ఈ హంగామాకు ఇన్స్టాగ్రామ్ దుమ్ములేచిపోయింది. లైకులే లైకులు. ఆ వీడియోకు ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి.