Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ కి స‌ముచిత గౌర‌వ పుర‌స్కారం

By:  Tupaki Desk   |   13 Oct 2022 4:48 AM GMT
ఐకాన్ స్టార్ కి స‌ముచిత గౌర‌వ పుర‌స్కారం
X
అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్‌'లో తన నటనకు అరుదైన పుర‌స్కారం ద‌క్కించుకున్నారు. వినోద విభాగంలో CNN-న్యూస్ 18 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022' పుర‌స్కారానికి ఎంపికయ్యాడు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అవార్డును అందజేసి బ‌న్నీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వేదిక‌పై బ‌న్ని ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను ప్ర‌స్థావించారు.

ఇండియన్ సినిమా గురించి... క్రాస్-కల్చర్ సినిమా గురించి హిందీ చలనచిత్ర పరిశ్రమ ఆధిపత్యంలో ఉన్న మార్కెట్ లో ప్రాంతీయ సినిమాకి పెరుగుతున్న ఆదరణ గురించి బ‌న్ని ఈ వేదిక‌పై స‌గ‌ర్వంగా చెప్పాడు.

మనమంతా పాన్-ఇండియా జోన్ లోకి అడుగుపెడుతున్నాము. ప్రాంతీయ సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళుతున్నాం. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. మన మధ్య వ్యత్యాసం ఉంది.. ఉత్తరం - దక్షిణం వంటి వ్య‌త్యాసాలున్నాయి. కానీ ఈ దేశం లోని అందం వైవిధ్యం అని మ‌నంద‌రికీ తెలుసు... అని బ‌న్నీ ఎంతో అద్భుతంగా మాట్లాడాడు.

పుష్ప‌ సినిమా ని భారతదేశం త‌న సినిమాగా సెల‌బ్రేట్ చేసుకుంది. కాబట్టి మనమందరం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొడుకులు కుమార్తెలుగా ఉన్నాం. ఇది భారతీయ సినిమా విజయం అని .. ఈ కష్ట సమయాల్లో వినోదంతో దేశానికి సేవ అందించగలమని భావిస్తున్నాను. దీనికి మేము గర్విస్తున్నాము.. అని అన్నారు. బ‌న్ని త‌న‌కు ద‌క్కిన అవార్డును కోవిడ్ 19 స‌మ‌యంలో సేవికులుగా ఉన్న డాక్ట‌ర్లు న‌ర్సులు హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు అంకితమిచ్చారు.

తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఉత్త‌ర భార‌త‌దేశంలో తనకు ఇదే తొలి అవార్డు అని అల్లు అర్జున్ ఈ సంద‌ర్భంగా వేదిక‌పై తెలిపారు. అతను CNN-న్యూస్ 18 ఫ్లాగ్ షిప్ అవార్డుల కార్యక్రమంలో అత్యుత్త‌మ పుర‌స్కారాన్ని గెలుచుకున్న మొదటి సౌత్ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.

ప్రతి రంగంలో మనకు ఉన్న వైవిధ్యం గురించి తెలుసు. దీనిని సెల‌బ్రేట్ చేసుకునే సమయం ఆసన్నమైందని మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. భారతదేశ సినిమా క‌థ‌కు ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని.. ప్రత్యేకించి సవాళ్లను ఎదుర్కొని గెలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.