Begin typing your search above and press return to search.
అల్లు అర్జునే నిజమైన పాన్ ఇండియా స్టార్..!
By: Tupaki Desk | 8 July 2022 5:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పదం 'పాన్ ఇండియా'. ప్రతి ఒక్క ఫిలిం మేకర్ జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలని ఆరాట పడుతున్నారు. అలాంటి కంటెంట్ లో నటించాలని హీరోలు ఆశ పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కాస్తా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే దీని కోసం డార్లింగ్ ఐదేళ్ల విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. మేకర్స్ కొన్ని వందల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇటీవల వచ్చిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. దీని కోసం వీరిద్దరూ మూడేళ్లు కేటాయించారు.
అయితే ప్రభాస్ - తారక్ - చరణ్ ముగ్గురూ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ.. మేజర్ క్రెడిట్ మాత్రం దర్శకుడు రాజమౌళి తీసుకెళ్లిపోయారమేది అందరూ చెప్పే మాట. ఈ విధంగా చూసుకుంటే బన్నీనే నిజమైన పాన్ ఇండియా స్టార్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వెండితెర మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకోవడం గ్యారెంటీ అనే రేంజ్ కు వచ్చేసారు. అందుకే ప్రభాస్ - చరణ్ - తారక్ లను పాన్ ఇండియా స్టార్స్ అనడం కంటే.. ఆ ఇమేజ్ తెచ్చిపెట్టింది రాజమౌళినే అని అంటుంటారు.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ 'సాహో' 'రాధే శ్యామ్' వంటి సినిమాలతో ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు. RRR తో వచ్చిన క్రేజ్ తో రామ్ చరణ్ 'ఆచార్య' చిత్రాన్ని హిట్ చేయలేకపోయారు. దీంతో రాజమౌళి సపోర్ట్ లేకుండా.. కేవలం వారి స్టార్డమ్ తో హిట్లు అందుకోలేరా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపించాయి.
అయితే రాజమౌళి సాయం లేకుండానే అల్లు అర్జున్ సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా 'పుష్ప: ది రైజ్' సినిమాని రిలీజ్ చేసి.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా.. వంద కోట్లకు పైగా వసూలు చేయడం బన్నీకే చెల్లింది.
'పుష్ప' నేషనల్ వైడ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ మేనరిజం.. 'తగ్గేదే లే' అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంతో మంది సెలబ్రిటీలు విదేశీ క్రీడాకారులు సైతం బన్నీ నటనకు ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు 'పుష్ప 2' పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే అతని క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
2020 ప్రారంభంలో 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. 2021 చివర్లో 'పుష్ప' చిత్రంతో తన కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రెండేళ్ల గ్యాప్ లో బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో ఎంతో సంపద సృష్టి జరిగింది. ఇలా బిజినెస్ క్రియేషన్ పరంగా చూసుకున్నా బన్నీ మిగతా వారి కంటే కాస్త ముందున్నాడని అనుకోవాలి. ఈ విధంగా బన్నీయే అసలైన పాన్ ఇండియా స్టార్ అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.