Begin typing your search above and press return to search.
తుది శ్వాస వరకు ఆ గౌరవం వుంటుంది : అల్లు అరవింద్
By: Tupaki Desk | 23 Aug 2022 11:30 AM GMTమెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయా?.. ఇరు కుటుంబాల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం.. స్టార్ డమ్ కోసం ఆదిపత్యం వంటివి జరుగుతున్నాయని గత కొంత కాలంగా వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. అల్లు అర్జున్ ఓ ఆడియో ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన గురించి చెప్పమని అడిగిన సందర్భంలో 'చెప్పను బ్రదర్' అంటూ కామెంట్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. బన్నీ కావాలనే అలా అన్నాడని మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
అది కాస్తా చిలికి చిలికి పెను తుఫానుగా మారి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా మారిపోయింది. ఆ తరువాత నుంచిమెగా ఫ్యాన్స్ బన్నీ మీది సోషల్ మీడియా వేదికగా కౌంటర్ లు వేయడం మొదలు పెట్టారు. కొంత మందైతే ఫ్యాన్స్ మీట్ పెట్టి బాహాటంగానే బన్నీని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ తనని బాయ్ కాట్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం.. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడం తెలిసిందే.
దీనికి ధీటుగా బన్నీ ఫ్యాన్స్ నెక్స్ట్ మెగాస్టార్ ఎవరు? అంటూ సోషల్ మీడియాలో సరికొత్త రచ్చకు తెరలేపారు. దీంతో మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా అగ్లీవార్ మొదలైంది.
మా హీరో గొప్ప అంటే మా హీరో లేకపోతే మీ హీరో లేని పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో ఫ్యాన్స్ వారు ఇరు మెగా కుటుంబాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఈ ఫ్యాన్స్ వారుపై, ఇరు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా ఇబ్బందికర వాతావరణం నెలకొందని జరుగుతున్న ప్రచారంపైఐ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ వార్ తో పాటు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు ఏర్పడ్డాయంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. బన్నీకి చిరంజీవి అంటే దైవంతో సమానం అన్నారు. ఆయన దులి శ్వాస వరకు ఆ గౌరవం అలాగే వుంటుందని స్పష్టం చేశారు. ఇక ఇరు కుటుంబాల మధ్య పోటీ నెలకొందని జరుగుతున్న ప్రచారంపై కూడా స్పష్టతనిచ్చారు.
మెగా ఫ్యామిలీలో చాలా మంది విజయవంతమైన హీరోలున్నారని, పోటీ అనేది కేవలం సినిమాల్లో మాత్రమేనని అయితే ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం రెండు కుటుంబాలు ఒక్కటేనని క్లారిటీ ఇచ్చారు. అల్లు అరవింద్ వివరణతో అయినా మెగా, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా జరుగుతున్న అగ్లీవార్ కు తెరపడుతుందా? లేక ఈ ఫ్యాన్ వార్ ఇలాగే కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.