Begin typing your search above and press return to search.
గీతా ఆర్ట్స్ వారు పద్దతి మారుస్తారట
By: Tupaki Desk | 20 July 2016 1:30 PM GMTఇప్పుడు సినిమాను తియ్యడం కంటే.. ఎంత బాగా దానిని ప్రమోట్ చేస్తారు అనేదే ఇంకా ముఖ్యం. బాహుబలి సినిమా తరువాత తెలుగు ఇండస్ర్టీ వర్గాల్లో ఆ ఆలోచనలు బాగా పెరిగాయి. పబ్లిసిటీతో పిచ్చెక్కించి ఓపెనింగులు అదరగొట్టాలని చూస్తున్నారు. ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ వారు కూడా అదే పనిలో నిమగ్నమైనట్లు అనిపిస్తోంది.
''వరుసగా ముందే పాటలు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళి.. ఆ తరువాత ఆడియో రిలీజ్ చేస్తాం. అంటే ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగే నాటికే పాటలకు హైప్ వచ్చేస్తుంది.. అప్పుడు ఆడియో రిలీజ్ రేంజే వేరేగా ఉంటుంది. ఈ విధంగా ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తాం'' అని చెబుతున్నారు అల్లు అరవింద్. ఇప్పటికే వారు ''సరైనోడు'' సినిమా విషయంలో.. ముందు వరుసగా ఒక్కొక్క పాటనూ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. వాటి వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అలా అంతా పూర్తయ్యాక ఆడియో వేడుక నిర్వహించారు. ఇలా వచ్చిన హైప్ కారణంగా.. సినిమాకు రివ్యూలు వీక్ గా ఉన్నా కూడా.. 76 కోట్ల షేర్ వసూళ్ళు వచ్చాయి. ఇప్పుడు తన చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా రూపొందిన ''శ్రీరస్తు శుభమస్తు'' కోసం కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
శిరీష్ అండ్ లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్స్ లో రూపొందిన ఈ సినిమా ఆడియోను జూలై 30న.. సినిమాను ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్లు అరవింద్ తెలిపారు. అది సంగతి.