Begin typing your search above and press return to search.
`రామాయణ 3డీ` ప్రాజెక్ట్‌ని వీడని అల్లు అరవింద్
By: Tupaki Desk | 8 Dec 2021 11:30 PM GMT`బహుబలి` ఇచ్చిన స్పూర్తితో వెలుగులోకి వచ్చిన ప్రాజెక్ట్ `రామాయణ`. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దాదాపు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రారంభించాలని ప్లాన్ చేసిన సినిమా ఇది.
టాలీవుడ్ , బాలీవుడ్ మేకర్‌ల కలయికలో ఈ ప్రాజెక్ట్‌ని అత్యంత సర్వాంగ సుందరంగా మలిచాలని.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా చేయాలని ప్రయత్నించారు.`దంగల్` ఫేమ్ నితీష్ తివారీ ఈ భారీ త్రీడీ మూవీకి డైరెక్టర్ గా పని చేస్తారని కూడా భారీ ప్రకటనని కూడా విడుదల చేశారు.
భారతీయ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో 1500 కోట్లతో ఈ మూవీని అన్ని భాషల్లోనూ రూపొందించాలని ప్లాన్ చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఇంచు ముందుకు కదలలేదు.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన తరువాత మలయాళ ప్రొడ్యూసర్ మోహన్ లాల్ కీలక పాత్రలో `మహా భారత్`ని ప్రకటించాడు. ఆ తరువాత రామాయణ గాధ నేపథ్యంలో ప్రభాస్ శ్రీరాముడిగా `ఆది పురుష్`ని ప్రకటించి షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ హీరోగా `రామసేతు` పేరుతో మరో సినిమా కూడా లైన్‌లోకి వచ్చేసింది.
దీంతో అల్లు అరవింద్ 1500 కోట్ల భారీ బడ్జెట్‌తో చేయాలనుకున్న రామాయణ 3డీని పక్కన పెట్టేశారనే వార్తలు మొదలయ్యాయి. డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రారంభించాలనుకున్న ఈ మూవీని అల్లు అరవింద్ పక్కన పెట్టేసి `ఆహా` ఓటీటీని డెవలప్ చేసే పనులలో బిజీగా మారిపోయారని అంతా అనుకున్నారు.
కానీ అల్లు అరవింద్ మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ రామయణని పక్కన పెట్టలేదని.. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ గురించే ఆలోచిస్తున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు, అమన్ గిల్ తో కలిసి `జెర్సీ` హిందీ రీమేక్ పనుల్లో బిజీగా వున్న అల్లు అరవింద్ `రామాయణ 3డీ` కోసం నిధులు సమీకరించే పనుల్లో యమ బిజీగా వున్నారట.
అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఈ చిత్రానికి సంబంధించిన గుడ్ న్యూస్ తో మళ్లీ మీడియా ముందుకు రావడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
`ఆహా`ని అనుకున్నట్టుగానే ఓ రేంజ్‌లో నిలబెట్టిన అల్లు అరవింద్ ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ `రామాయణ 3డీ` ఎలాగైనా పట్టాలెక్కించే పనుల్లో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రనే ఈ సినిమాతో అల్లు అరవింద్ సువర్ణాక్షరాలతో పున: లిఖించడం ఖాయం అని చెబుతున్నారు.